HomeTelugu cinema

ప్రియుడిని పరిచయం చేసిన పాయల్ రాజ్‌పూత్
Published By :  Divya Valluru Image Image
Payal Rajput admits in love with Sourabh Dingra; shares photos with him
Friday Feb 14, 2020
'ఆర్ఎక్స్ 100' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఉత్తరాది భామ పాయల్ రాజ్ పుత్ తన ప్రియుడిని అభిమానులకు పరిచయం చేసింది. ఈరోజు వ్యాలెంటైన్స్ డే సందర్భంగా పాయల్ తన బాయ్‌ఫ్రెండ్‌ని పరిచయం చేస్తూ తమ ప్రేమకథను అభిమానులతో పంచుకుంది. పాయల్ లవర్ పేరు సౌరభ్ డింగ్రా. ఇతను ముంబయికి చెందిన మోడల్. చాలా కాలంగా సౌరభ్‌తో పాయల్ ప్రేమలో ఉంది. 

'నాలోని లోపాలను కూడా ప్రేమించే ఏకైక వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ కంటే విలువైన వ్యక్తి నా జీవితంలో మరెవరూ లేరు. మనిద్దరం కలిసి గడిపిన ప్రతి క్షణం నాకు మధుర జ్ఞాపకమే, హ్యాపీ బర్త్‌డే మేరే జాన్' అని ట్వీట్ చేసింది.

కొన్ని నెలల క్రితం పాయల్ ఓ వ్యక్తితో కలిసి సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఇంస్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సంగతి తెల్సిందే. అతను మీ బాయ్‌ఫ్రెండా అని అభిమానులు అడిగితే అదేమ్లేదని పాయల్ జవాబిచ్చింది. అయితే, ఇప్పుడు మాత్రం తన ప్రేమ విషయాన్నీ అందితో పంచుకుంది. 

పాయల్ చివరగా రవి తేజ నటించిన డిస్కో రాజా సినిమాలో నటించింది.

   Politics

   Lifestyle