HomeTelugu cinema

రవితేజ క్రాక్ టీజర్ వచ్చేస్తోంది
Published By :  Lasya Raghavaraju Image Image
Ravi Teja Crack Jathara teaser release soon; unit release new poster
Thursday Feb 13, 2020
మాస్ మహారాజ రవితేజ  పక్కా మాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "క్రాక్". ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న క్రాక్ సినిమా పోస్టర్స్ ఇప్పటికే విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. 

తాజా సమాచారం ప్రకారం క్రాక్ టీజర్ త్వరలో విడుదల చేయనున్నామని చిత్రబృందం ఒక పోస్టర్ వదిలింది. రవితేజ డార్క్ షాడో గా పరిగెత్తుకుంటూ వస్తున్న ఈ పోస్టర్ ఒక యాక్షన్ సీన్ కి సంబంధించిందని అర్ధం అవుతోంది.  అన్ని ఎలిమెంట్స్ ఉండేలా టీజర్ ను కట్ చేసేపనిలో ఉన్నారట చిత్రయూనిట్. 

డాన్ శ్రీను, బలుపు తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న మూడవ సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. వేసవి కానుకగా మే 8న ప్రపంచవ్యాప్తంగా క్రాక్ రిలీజ్ కానుంది. 

   Politics

   Lifestyle