HomeTelugu cinema

నాగ‌శౌర్య-రీతూ వర్మ జంటగా సినిమా మొద‌లైంది!
Published By :  Lasya Raghavaraju Image Image
Naga Shaurya-Ritu Varma paired together for first time
Thursday Feb 13, 2020
సొంత బ్యానర్లో వచ్చిన 'అశ్వథామ' చిత్రంతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన నాగశౌర్య కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు. నాగశౌర్య కథానాయకుడిగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఒక సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాగశౌర్య సరసన పెళ్లిచూపులు చిత్రంతో తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసిన రీతూ వర్మను తీసుకున్నారు. ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతోంది. ఈ రోజు ఉదయం ఫిల్మ్ నగర్ లోని సంస్థ కార్యాలయంలో ఈ సినిమాను లాంచ్ చేశారు.

ఈ నెల 19వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఇతర నటీనటుల వివరాలను .. సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు.  

ఇంకా పేరుపెట్టని ఈ చిత్రానికి కెమెరా: వ‌ంశీ ప‌చ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్ర‌శేఖ‌ర్‌, ఆర్ట్: ఏ.ఎస్‌. ప్ర‌కాష్‌, ఎడిటింగ్‌: న‌వీన్ నూలి.

   Politics

   Lifestyle