HomeTelugu cinema

పెళ్లికి ముందు అది తప్పు కాదంటున్న కైరా అద్వానీ
Published By :  Lasya Raghavaraju Image Image
Kiara Advani says there is no wrong in Dating with lover
Thursday Feb 13, 2020
'భరత్ అనే నేను' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కైరా అద్వానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఈ అమ్మడు ఏం చెప్పిందంటే...పెళ్లికి ముందు కాబోయే వాడితో తిరిగితే తప్పు ఎలా అవుతుందని, అది తప్పు కానేకాదని కైరా చెప్తోంది. 

కాబోయే వాడు నచ్చితే అతడి గురించి మరింతగా అర్ధం చేసుకోవడానికి డేటింగ్ కి వెళితే తప్పేంటి ? ఒకరిని విడిచి మరొకరం ఉండలేమనే నిర్ణయానికి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చని తెలిపింది. అయితే అది ప్రేమించిన వాళ్లకు మాత్రమే నాకు కాదు సుమా ! ఎందుకంటే నేను ఎవరినీ ప్రేమించడం లేదు నాకు అంత తీరిక లేదని అంటోంది. ప్రస్తుతం నా దృష్టి అంతా సినిమాల మీదే ఉందని అంటోంది కియారా అద్వానీ.

బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ మళ్ళీ తెలుగులో నటించడానికి సిద్ధం అవుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు పక్కన ఈ అమ్మడు నటించనుందని తెలుస్తోంది. భరత్ అనే నేను తర్వాత  కియారా అద్వానీ రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ చిత్రంలో నటించింది. ఆ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది కానీ అది డిజాస్టర్ కావడంతో తెలుగులో ఈ భామకు ఛాన్స్ లు రాలేదు. అయితే మహేష్ బాబు మరోసారి ఈ భామకు ఛాన్స్ ఇస్తున్నాడట. 

   Politics

   Lifestyle