HomeTelugu cinema

ఆకట్టుకుంటున్న రానా 'హాథీ మేరే సాథీ' టీజర్
Published By :  Lasya Raghavaraju Image Image
Rana's Haathi meri Saathi Teaser looks interesting
Thursday Feb 13, 2020
దగ్గుబాటి రానా కథానాయకుడిగా త్రిబాషా చిత్రంగా 'హాథీ మేరే సాథీ' అనే చిత్రం తెరకేక్కుతున్న విషయం తెలిసిందే. తమిళంలో 'కాడన్' పేరుతో .. తెలుగులో 'అరణ్య' పేరుతో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. హిందీ వెర్షన్ కి సంబంధించిన టీజర్ ను నిన్న రిలీజ్ చేశారు. ఈరోస్ ఇంటెర్నేషనల్ వారు నిర్మించిన ఈ సినిమాకి ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించాడు.

అడవిలోనే పుట్టి పెరిగిన యువకుడి పాత్రలో రానా కనిపిస్తున్నాడు. అడ‌విలో రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్ లు వేసి జంతువుల మ‌నుగ‌డ‌కు ప్రమాదకరంగా మారిన వ్య‌క్తుల‌పై రానా అక్కడి గిరిజన జనంతో కలిసి పోరాటం చేస్తాడు. రియల్ ఎస్టేట్, స్మగ్లింగ్ ల ద్వారా ప్రకృతిని ద్వసం చేస్తున్న కార్పోరేట్ మనుషులపై యుద్ధం చేసే ధీరుడుగా రానా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు. ఆయన లుక్ .. బాడీ లాంగ్వేజ్ కొత్తగా అనిపిస్తున్నాయి. తమిళ టీజర్ ను కూడా నిన్న సాయంత్రమే రిలీజ్ చేశారు. తెలుగు టీజర్ ను విడుదల చేయవలసి వుంది. 

త‌మిళ వెర్ష‌న్లో విష్ణు విశాల్ ఓ కీల‌క పాత్ర చేయ‌గా, హిందీలో అదే పాత్ర‌ను పుల‌కిత్ సామ్రాట్ చేశాడు. ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ లాంటి బ‌డా బాలీవుడ్ నిర్మాణ సంస్థ అర‌ణ్య సినిమాను ప్రొడ్యూస్ చేసింది. ఈ మూడు భాషల్లోను ఈ సినిమాను ఏప్రిల్ 2వ తేదీన విడుదల చేయనున్నారు.

   Politics

   Lifestyle