HomeTelugu cinema

అహం బ్రహ్మాస్మితో మంచు మనోజ్ రీ-ఎంట్రీ
Published By :  Lasya Raghavaraju Image Image
Manchu Manoj announces his next Aham Brahmasmi
Thursday Feb 13, 2020
దాదాపు మూడేళ్ళుగా సినిమాలకు దూరంగా ఉంటున్న మంచు మనోజ్ మళ్ళీ వెండితెరపై సందడి చేయనున్నాడు. ఎంఎం ఆర్ట్స్ పేరుతో కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించిన మనోజ్ తొలి సినిమాగా ‘అహం బ్రహ్మాస్మి’ అనే పాన్ ఇండియా మూవీ ని ప్రకటించాడు. గురువారం రోజున మనోజ్ ఆ సినిమా టైటిల్ పోస్టర్ అభిమానులతో ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. 

'అహం బ్రహ్మాస్మి; చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం మార్చి 6న హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనుంది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఆధ్యాత్మికతతో కూడుకున్న సోషియో ఫాంటసీ చిత్రంగా అహం బ్రహ్మస్మి ఉండనుందని సమాచారం. ఇక ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు.

మూడేళ్ల తరువాత మనోజ్ సినిమాల్లోకి మళ్లీ వస్తుండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొని ఉంది.

   Politics

   Lifestyle