HomeTelugu cinema

రవి తేజ డిస్కో రాజా టీజర్ 2.0 చూసారా
Published By :  Divya Valluru Image Image
Ravi Teja's Disco Raja Teaser 2.0 released to positive buzz
Tuesday Jan 14, 2020
మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు వి ఐ ఆనంద్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కుతున్న డిస్కో రాజా జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నభా నటేష్, పాయల్ రాజ్ పుత్, తాన్యా హోప్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ , టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి సందర్భంగా డిస్కో రాజా టీజర్ 2.0ను చిత్రయూనిట్ విడుదల చేసింది. 

ఒక నిమిషం ఆరు సేకన్లు ఉన్న ఈ టీజర్ సినిమాపైన మరిన్ని అంచనాలను పెంచేసింది. " సోల్జర్స్ సంవత్సరాల పాటు బాంబులతోనూ, ఫైరింగ్స్ తోను యుద్దాలు చేసి రిటైర్ అయి ఇంట్లో ఉంటే సడన్ గా వచ్చే సైలెన్స్ ఉంటుంది చూడు అది అప్పటిదాకా వాళ్ళు చూసిన వైలెన్స్ కంటే భయకరంగా ఉంటుంది అన్న డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది.  రవితేజ టీజర్ లో స్టైలిష్ లుక్ లో కనిపిస్తుండగా..బాబీ సింహా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. 

ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఎస్‌ థమన్‌ మ్యూజిక్‌డైరెక్టర్‌. వెన్నెల కిశోర్‌, సత్య, అజయ్‌ కీలక పాత్రల్లో నటించారు. డిస్కో రాజా సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.