HomeTelugu cinema

రామ్ చరణ్ పక్కన మరోసారి కియారా అద్వాని
Published By :  Lasya Raghavaraju Image Image
Kiara Advani in talks to pair opposite Ram Charan in Chiru 152
Tuesday Jan 14, 2020
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమా ‘చిరు 152’ రెగ్యులర్ షూటింగ్ కొద్దిరోజుల క్రితం ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. గోవింద్ ఆచార్య పేరుతో ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో చిరు సరసన త్రిష కథానాయికగా ఎంపికైంది. ఈ సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కూడా ఓ కీలక పాత్ర పోషించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
 
ఈ సినిమా కోసం చెర్రీ 40 రోజుల కాల్షీట్లు కూడా ఇచ్చాడట. త్వరలోనే ఆయన షూటింగ్‌కు హాజరుకాబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో రామ్ చరణ్ కు ఒక లవ్ ట్రాక్ ఉంటుందని.. అందులో ఒక సాంగ్ కూడా వస్తుందని ఇండస్ట్రీ టాక్. అందుతున్న వార్తల ప్రకారం రామ్ చరణ్  సరసన కియారా అద్వాని హీరోయిన్‌గా కనిపించబోతోందట. గతంలో వీరిద్దరూ కలిసి `వినయ విధేయ రామ` సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అవ్వలేకపోయింది. మొదట్లో ఈ పాత్రకు సాయి పల్లవిని అనుకున్నారట కానీ ఇప్పుడు అభిప్రాయం మార్చుకున్నారట చిత్రబృందం.

కియారా చేతిలో చాలా బాలీవుడ్ మూవీస్ ఉన్నాయి. ఈ చిత్రంలో తన పాత్రకు కొన్ని సీన్స్ మాత్రమే.. కనుక తను ఓకే చేస్తుందో లేదో చూడాలి మరి. ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం RRR మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత ‘చిరు 152’ లో నటించనున్నారు.