HomeTelugu cinema

అల్లు అర్జున్‌ గారు అంటూ పవన్ కళ్యాణ్ స్పెషల్ విషెస్
Published By :  Divya Valluru Image Image
Pawan Kalyan wishes Allu Arjun for Ala Vaikuntapuramulo success
Tuesday Jan 14, 2020
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మూడో సినిమాగా వచ్చిన అల వైకుంఠపురములో చిత్రం ఆదివారం విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. ఈ సినిమా మొదటి రోజు 85 కోట్ల గ్రాస్‌ వసూళ్ళు చేసినట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించారు.  అల వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్ నటనకు ప్రేక్షకుల నుండే కాకుండా సెలబ్రిటీల నుంచి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. నిన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా బావా శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేసాడు.

తాజాగా అల్లు అర్జున్‌ మామయ్య, పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాన్ బన్నీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లవర్‌ బొకేను పంపించాడు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ తన సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. బన్నీకి ఫ్లవర్‌ బోకే పంపిన పవన్‌, ఆ బోకే తో పాటు ఓ సందేశాన్ని పంపించాడు.

"గౌరవనీయులైన అల్లు అర్జున్‌ గారు, అల వైకుంఠపురములో సినిమాలో ఘనవిజయం సాధించిన సందర్భంగా శుభాకాంక్షలు. భవిష్యత్తులో మీరు చేయబోయే సినిమాలకు ఆల్‌ ది బెస్ట్` అంంటూ తానే స్వయంగా ఓ లెటర్‌ రాసి పంపించాడు. అయితే ఈ లెటర్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేసిన బన్నీ `పవన్‌ కళ్యాన్‌ గారి నుంచి శుభాకాంక్షలు రావటం ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్యూ వెరీ మచ్‌ పవన్‌ కళ్యాన్‌ గారు` అంటూ ట్వీట్ చేశాడు బన్నీ. 

ఇటీవల ప్రతిరోజు పండగే సినిమా సక్సెస్ సందర్భంగా సాయి ధరమ్‌ తేజ్‌కు శుభాకాంక్షలు పంపిన పవన్‌, సాయిని కూడా ఇలాగే గారు అంటూ సంభోదించాడు.