HomeTelugu cinema

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖులకు క్లీన్ చిట్
Published By :  Ravi Koneri Image Image
Tollywood celebs given clean chit in drugs case
Tuesday Jan 14, 2020
మూడేళ్ళ క్రితం టాలీవుడ్ సినిమ పరిశ్రమలో తీవ్ర కలకలం రేపిన డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు అధికారులు క్లీన్ చిట్ ఇచ్చారనే వార్త ఇప్పుడు తీవ్ర చర్చనీయంసమైంది. సెలబ్రిటీలందరూ బాధితులేతప్ప నిందితులు కాదని వాళ్ల కనీసం వారి పేర్లను చార్జి షీట్లలో కూడా ఎక్సైజ్ శాఖ, సిట్ అధికారులు ప్రస్తావించలేదట.  ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ వ్యవస్థాపకులు పద్మనాభరెడ్డి సమాచార హక్కు చట్టం ద్వారా ఈ కేసుకు సంబంధించిన విషయాలు కావాలని అడగడంతో, ఈ ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. 

ప్రధానమైన పబ్బుల్లో డ్రగ్స్‌ పంపిణీ చేస్తూ విదేశీయుడైన కెల్విన్ అనే వ్యక్తి పోలీసులకు చిక్కాడు. తీగ లాగితే డొంక బయటపడ్డట్లు ఇతణ్ని విచారణ జరిపితే మొత్తం 62 మంది ప్రముఖుల పేర్లు బయట పెట్టాడు. అందులో 11 మంది సినీ ప్రముఖులు ఉన్నారు. ఈ 11 మందిలో డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌, హీరోలు రవితేజ, తరుణ్‌, నవదీప్‌, తనీష్‌, నటులు.. సుబ్బరాజు, నందు, శ్యామ్‌ కే నాయుడు, రవితేజ డ్రైవర్‌ శ్రీనివాస్‌, చిన్నా, హీరోయిన్‌లు చార్మీ, ముమైత్‌ ఖాన్‌ తదితరులు ఉన్నారు.

నెల రోజులపాటు విచారణలు జరిపిన సిట్.. ప్రముఖుల వెంట్రుకలు, గోర్లు తదితర ఆనవాళ్లను సేకరించింది. ఒక దశలో నిందితులకు కఠిన శిక్షలు తప్పవని కూడా సిట్ హెచ్చరించింది. తీరా చూస్తే ఈ కేసుతో సంబంధమున్న పలువురు సెలబ్రిటీలకు క్లీన్‌చిట్‌ దక్కడం వివాదాస్పదమైంది.

నిందితులను బాధితులుగా పేర్కొనడాన్ని, చార్జి షీటులో సెలబ్రిటీల పేర్లు చేర్చకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌' వ్యవస్థాపకుడు పద్మనాభరెడ్డి. కేసును తప్పుగా ఎంక్వైరీ చేసారని ఆయన తెలంగాణ సీఎస్‌ సోమేశ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు.

   Politics

   Lifestyle