HomeTelugu cinema

నా అదృష్టం ఆవగింజంతే అంటున్న భీష్మ
Published By :  Lasya Raghavaraju Image Image
Nitin-Rashmika's Bheeshma Teaser looks entertaining
Monday Jan 13, 2020
నితిన్, రష్మిక మందన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన భీష్మ సినిమా టీజర్‌ను చిత్రబృందం ఆదివారం ఉదయం విడుదల చేసింది. ఫన్ అండ్ రొమాంటిక్ ఎలిమెంట్స్‌తో నిమిషానికి పైగా ఉన్న భీష్మ టీజర్‌లో నితిన్ ఎనర్జీ, కామెడీ టైమింగ్ ఆకట్టుకుంది. 

‘నీ పేరేంటి’ అని నితిన్‌ను సంపత్ అడిగితే.. ‘భీష్మ’ అంటాడు. అప్పుడు ఆయన ‘భీష్మ కాదు భీష్మ సర్ అనాలి’ అంటాడు. ఇందుకు నితిన్ స్పందిస్తూ.. ‘అంటే నా పేరుకి సర్ యాడ్ చేస్తే బాగోదేమో’ అని వేసిన పంచ్ నవ్వులు పూయిస్తోంది.

'నా అదృష్టం ఆవగింజంత ఉంటే దురదృష్టం దబ్బకాయంత ఉందని' అంటూ నితిన్ బాధపడుతూ చెప్తున్న డైలాగ్ కామెడీగా ఉంది. ఎవరి వాల్యూ అయినా బతికున్నప్పుడు కంటే చనిపోయాకే పెరుగుతుంది భయ్యా’ అని నితిన్‌ చెప్పగానే.. ‘అదెలా’ అని వెన్నెల కిషోర్‌ ప్రశ్నిస్తాడు. ‘ఓ కోడి బతికున్నప్పుడు కిలో 90 రూపాయాలు.. అదే చనిపోయాక కిలో 190 రూపాయలు.’ అని నితిన్‌ చెప్పే సమాధానం ఫన్నీగా అనిపిస్తుంది. మరోవైపు రఘుబాబు, వెన్నెల కిషోర్‌ కామెడీ టైమింగ్‌ అలరిస్తుంది. 

సితార ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్‌ అందించిన సంగీతం అలరించింది. ఫిబ్రవరి 21న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.