HomeTelugu cinema

కేబుల్ టీవీ వినియోగదారులకు తీపికబురు
Published By :  Divya Valluru Image Image
Consumers to have 200 channels instead of 100 in Rs 130 NCF pack
Monday Jan 13, 2020
కేబుల్ బిల్లు భారంతో సతమతమవుతున్నకేబుల్ టీవీ వినియోగదారులకు ట్రాయ్(టెలికాం రెగులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. టారిఫ్ ఆర్డర్‌కు ట్రాయ్ తాజాగా సవరణలు చేసింది. రూ.130కే (NCF) ఫ్రీ టూ ఎయిర్‌ చానెల్స్‌ ఇవ్వాలని ట్రాయ్ నిర్ణయించింది.

ట్రాయ్ చేసిన ఈ సవరణల ప్రకారం ఇక 130 రూపాయలకే దాదాపు 200 ఛానల్స్‌ను వీక్షించే అవకాశం ఉంది. గతంలో వంద ఛానల్స్ మాత్రమే చూసే వీలుంది. అంతేకాదు, మెజార్టీ ప్రజలు వీక్షించే స్పోర్ట్స్ ఛానల్స్ ధరలు కూడా ఒక్కో ఛానల్‌కు 12 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. బొకే చానెల్స్‌లో ఒక చానెల్‌ ఖరీదు రూ.12కు మించకూడదని ట్రాయ్‌ స్పష్టం చేసింది. ఇన్నాళ్లూ ఈ ధర రూ.19 గా ఉండేది. ప్లేస్‌మెంట్ మార్చాలంటే అనుమతి తప్పనిసరిగా ఉండాలని ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ తెలిపారు. ఒక ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు ఉంటే 40 శాతం వసూలు చేయాలని కేబుల్ ఆపరేటర్లకు ట్రాయ్‌ సూచించింది.  

ట్రాయ్ సవరణలతో కేబుల్ బిల్లులో 14 శాతం ఆదా అయ్యే అవకాశం ఉంది.

   Politics

   Lifestyle