HomeTelugu cinema

`అల వైకుంఠ‌పుర‌ములో` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌ ఎంతంటే
Published By :  Lasya Raghavaraju Image Image
Allu Arjun's Ala Vaikuntapuramulo collects Rs 26.21 on First day
Monday Jan 13, 2020
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా నిన్న విడుదలై సుపేట్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్‌ వద్ద అద్భుతంగా రాణిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, కె. రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించిన ‘అల వైకుంఠపురములో’ ప్రీమియర్ షోలకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో కలెక్షన్స్ రికార్డ్ స్థాయిలో వస్తున్నాయి. అల వైకుంఠ‌పుర‌ములో ఫ‌స్ట్ డే.. 26.21 కోట్ల షేర్ తో అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ అనిపించుకోవడమే కాకుండా అల్ టైం ఫస్ట్ డే ఆంధ్ర – తెలంగాణ షేర్స్ లో 6వ స్థానంలో నిలిచింది.

‘అల వైకుంఠపురములో’ ఆంధ్ర – తెలంగాణ ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్:

నైజాం- 6.03 కోట్లు
సీడెడ్- 4.03 కోట్లు
గుంటూరు- 3.42 కోట్లు
ఉత్తరాంధ్ర- 2.9 కోట్లు
తూర్పు గోదావరి- 3 కోట్లు
పశ్చిమ గోదావరి- 2.42 కోట్లు
కృష్ణా- 3.11 కోట్లు
నెల్లూరు- 1.3 కోట్లు

ఫస్ట్ డే మొత్తం షేర్ – 26.21 కోట్లు