HomeTelugu cinema

బాలకృష్ణ-బోయపాటి మూడో సినిమా ప్రారంభం
Published By :  Divya Valluru Image Image
Balakrishna's new film with Boyapati launched formally
Friday Dec 06, 2019
నందమూరి బాలకృష్ణకు సింహ, లెజెండ్ లాంటి హిట్ సినిమాలను అందించిన బోయపాటి శ్రీనుతో బాలయ్య  ముచ్చటగా మూడో సినిమా చేయనున్నాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌లో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్న ఈ సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలతో మొదలైంది. దర్శకుడు బి గోపాల్ క్లాప్ కొట్టి సినిమాను ప్రారంబించారు. వచ్చే వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.

ఇంకా పేరుపెట్టని ఈ సినిమాలో బాలకృష్ణ సరనస జెర్సీ మూవీ ఫేం శ్రద్ధా శ్రీనాద్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్‌గా, రోజా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ అంటేనే జనాల్లో ఒక క్రేజ్ ఏర్పడింది అందుకే ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. 

ప్రస్తుతం బాలకృష్ణ కే. యస్ రవికుమార్ దర్శకత్వంలో రూలర్ అనే సినిమాని చేస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్న ఈ సినిమా క్రిస్మస్ పండగ సందర్భంగా డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని సీ కళ్యాణ్ నిర్మిస్తున్నారు. వేదిక, సోనాలి చౌహాన్ కథానాయకులుగా నటిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

   Politics

   Lifestyle