HomeTelugu cinema

షాద్ నగర్ ఎన్‌కౌంటర్‌పై పవన్ కళ్యాణ్ స్పందన
Published By :  Divya Valluru Image Image
JSP Chief Pawan Kalyan response on Disha rape accused encounter
Friday Dec 06, 2019
దిశ కేసు నిందితుల‌ని షాద్ నగర్ ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు ఎన్‌కౌంట‌ర్ చేయ‌డం ప‌ట్ల స‌ర్వత్రా హ‌ర్షం వ్యక్తం అవుతుంది. సామాన్యులు,  సెల‌బ్రిటీలు తెలంగాణ పోలీసులకు జై కొడుతూ.. ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. పలు పార్టీల నేతలు సైతం పోలీసుల చర్యను స్వాగతిస్తున్నారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. 

'దిశ ఉదంతం మన ఆడపడుచుల రక్షణకు ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోవని హెచ్చరిస్తోంది. ఆ కరాళ రాత్రి వేళ నలుగురు ముష్కరుల మధ్య దిశ ఎంత నరకాన్ని చూసిందో తలచుకుంటేనే ఆవేశం, ఆక్రోశం, ఆవేదనతో శరీరం ఉడికిపోతోంది. జాతి యావత్తు తక్షణ న్యాయం కోరుకోవడానికి కారణం ఈ ఆవేదనే. దిశ సంఘటన ముగిసిందని దీనిని మనం ఇంతటితో వదిలిపెట్టకూడదు. మరే ఆడబిడ్డకు ఇటువంటి పరిస్థితి రాకూడదు. నిర్భయ ఉదంతం తరువాత బలమైన చట్టాన్ని మన పార్లమెంటు తీసుకొచ్చింది. అయినా అత్యాచారాలు ఆగలేదు. అంటే ఇంకా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని జరుగుతున్న సంఘటనలు తెలుపుతున్నాయి. ఆడపిల్లల వైపు వక్రబుద్ధితో చూడాలంటేనే భయపడే విధంగా కఠినాతి కఠినమైన చట్టాలు రావలసిన అవసరం ఉంది. ఇతర దేశాలలో ఎటువంటి చట్టాలు ఉన్నాయో అధ్యయనం చేయాలి.'' అని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

దిశ నిందితులను షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి వద్ద ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులను అభినందిస్తూ పూరి జగన్నాధ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. "తెలంగాణ పోలీసులకు సల్యూట్ చేస్తున్నానని, అంతేకాదు చేతులెత్తి మొక్కుతున్నానంటూ మీరే నిజమైన హీరోలు.. నేను ఎప్పటికి ఒక్కటే నమ్ముతాను. మనకి కష్టమొచ్చిన కన్నీళ్లోచ్చినా పోలీసోడే వస్తాడని.. అంతేందుకు నువ్వే దిక్కు రక్షించాలని దేవుడికి మొక్కినా ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోడినే అంటూ పూరి జగన్నాధ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై నేచురల్ స్టార్ నాని ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ...ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి.. వాడు పోలీసోడు అయ్యుండాలి అని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

   Politics

   Lifestyle