HomeTelugu cinema

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ పై సమంత రియాక్షన్
Published By :  Divya Valluru Image Image
Samantha welcomes Disha rape and murder accused encounter
Friday Dec 06, 2019
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన దిశను హత్యాచారం  నిందితులను పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్‌ చేశారు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎక్కడైతే ఘాతుకానికి ఒడిగట్టారో అదే స్థలంలో నిందితులు ప్రాణాలు విడిచారు. 

ఎన్‌కౌంటర్‌పై సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ... దిశ హత్యకేసు నిందితులను సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా విచారణ జరుపుతున్నప్పుడు పోలీసులుపై దాడి చేశారని, తప్పించుకుని పారిపోతుండగా, పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసినట్లు తెలిపారు. పోలీసుల నిర‍్వహణలో భాగంగానే ఎన్‌కౌంటర్‌ జరిగిందని అన్నారు. మరోవైపు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు.

దిశ నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై దేశ వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ ఘటనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిందితులకు సరైన శిక్ష పడిందంటూ ట్వీట్లు, పోస్టులు ట్రెండ్ అవుతున్నాయి. తెలంగాణ పోలీసులు, సీపీ సజ్జనార్‌ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ నేపధ్యంలో ఈ ఎన్‌కౌంటర్‌ పై నటి సమంత స్పందించారు.."ఐ లవ్ తెలంగాణ.. ఎన్ కౌంటర్ చేయడంతో కొంత భయాన్ని మిగితవారిలో కలిగించారని.. అప్పడప్పడూ ఇలాంటివి అవసరం అంటూ ట్వీట్ చేసింది.

దిశ కేసులో నిందితులు చచ్చారు అనే వార్తలో కిక్కు ఉందంటూ టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌ ఆనందం వ్యక్తం చేశారు. 

‘ఆ బుల్లెట్టు దాచుకోవాలని ఉంది.. తుపాకీలకు దండం పెట్టుకోవాలని ఉంది.. ఆ పోలీసుల కాళ్లు మొక్కాలని ఉంది.. నలుగురు చచ్చారు అనే వార్తలో ఇంత కిక్కు ఉందా? ఈ రోజు నీ ఆత్మ దేవుడిని చేరింది చెల్లెమ్మా’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. 

"దిశకు నరకం చూపించి చంపేసిన నలుగురు రాక్షసులకు ఎట్టకేలకు శిక్ష పడిందని, ఇక దిశ ఆత్మ శాంతిస్తుందని" యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్వీ్ట్ చేశారు. 

"ఉదయం నిద్రలేవగానే గొప్ప వార్త విన్నామని హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారిని ఘోరంగా చంపినప్పటికీ న్యాయం గెలిచినందుకు సంతోషంగా ఉందని" ప్రణీత ట్వీట్ చేశారు.

   Politics

   Lifestyle