HomeTelugu cinema

డిస్కో రాజా నుంచి పాయల్ లుక్ వచ్చేసింది
Published By :  Divya Valluru Image Image
Payal Rajput's look from Disco Raja released as her Birthday gift
Thursday Dec 05, 2019
కార్తికేయ కథానాయకుడిగా వచ్చిన RX100 సినిమాలో ఇందు పాత్రతో తెలుగుతెరకు పరిచయమైన పంజాబీ భామ పాయల్ రాజ్ పుట్ త్వరలో విక్టరీ వెంకటేష్ సరసన వెంకీ మామ సినిమాలో కనిపించనుంది.  వెంకీ మామ ఈ నెల 13 న విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత పాయల్ మాస్ మహారాజా కథానాయకుడిగా విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న డిస్కో రాజా సినిమాలో నటిస్తోంది. 

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న డిస్కో రాజా సినిమాలో నభా నతేష్ మరో హీరోయిన్. కాగా ఈ రోజు పాయల్ పుట్టిన రోజు సందర్భంగా పాయల్ పాత్ర కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ లో ఖాకి రంగు డ్రెస్సులో, రెండు జ‌డ‌లు వేసుకొని చేతిలో గ‌న్ ప‌ట్టుకొని సీరియ‌స్ లుక్‌లో పాయల్ క‌నిపిస్తుంది. ఈ పోస్ట‌ర్ పాయ‌ల్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

ఎస్ఎస్  థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో తాన్యా హాప్.. బాబీ సింహా, సునీల్, వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ ఆర్ టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న డిస్కో రాజా చిత్రం జనవరి 24న విడుదల కానుంది.