HomeTelugu cinema

బెంగళూరు ఇంటి వార్తలను ఖండించిన రకుల్
Published By :  Divya Valluru Image Image
Rakul Preet Singh slams journalists for fake reports
Monday Dec 02, 2019
నాగార్జున పక్కన నటించిన "మన్మధుడు 2" ఫ్లాప్ తర్వాత తెలుగులో సినిమా అవకాశాలు తగ్గడంతో రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ నాట నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తోంది. అయితే రకుల్ పై ఈ మధ్యన చాలా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్‌లోని తన ఇల్లు అమ్మేసి బెంగళూరులో మరో ఇల్లు కొనాలని యత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియా తో పాటు, ప్రైవేట్ వెబ్ సైట్లలోనూ రకుల్ హైదరాబాద్ ఇంటి గురించి వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి.

ఈ వార్త చూసిన అభిమానులు రకుల్ నిజంగా హైదరాబాద్ నుంచి మకాం మార్చనుందా అని చర్చ మొదలెట్టారు. దీంతో రకుల్ సోషల్ మీడియాలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. "కొందరు జర్నలిస్ట్‌లకు ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియట్లేదు. హైదరాబాద్‌లో ఇల్లు కొనుక్కున్నప్పుడు ఎవరో కానుకగా ఇచ్చారు అని రాశారు, ఇప్పుడేమో ఆ ఇల్లు అమ్మేసి బెంగళూరులో కొనుక్కుంటున్నాని రాస్తున్నారు.  ఇలాంటి వార్తలను రాయడం మానేసి రియల్ న్యూస్ ఇస్తే అందరికీ మంచిది" అంటూ ఘాటుగా స్పందించారు.

   Politics

   Lifestyle