HomeTelugu cinema

ప్రతిరోజూ పండగే ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Published By :  Lasya Raghavaraju Image Image
Prathiroju Pandage trailer release date locked
Monday Dec 02, 2019
మెగా హీరో సాయిధరమ్ తేజ్, రాశి ఖన్నా జంటగా మారుతీ దర్శకత్వంలో 'ప్రతిరోజూ పండగే' సినిమా తెరకెక్కుతోంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో సత్యరాజ్, రావు రమేశ్ .. మురళీ శర్మ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్, యువీ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమానుంచి విడుదలైన పాటలు ఆకట్టుకున్నాయి. ఈ నెల 20న విడుదల కానుండడంతో  ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రబృందం. ప్రతిరోజూ పండగే ట్రైలర్ డిసెంబర్ 4వ తేదీన విడుదల కానుంది.  గతంలో సాయిధరమ్ తేజ్ - రాశి ఖన్నా జంటగా నటించిన 'సుప్రీమ్' భారీ విజయాన్ని నమోదు చేసింది. 

ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్, సత్యరాజ్ తండ్రికొడుకులుగా నటిస్తున్నారు. 

   Politics

   Lifestyle