సూపర్ స్టార్ మహేష్ బాబు ఆర్మీ అధికారిగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్దమవుతుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై మహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకర ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
సరిలేరు నీకెవ్వరు టీజర్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఇకపోతే ఈ సినిమా నుండి మైండ్ బ్లాక్ అనే పల్లవితో సాగె మాస్ సాంగ్ ని కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసారూ చిత్రబృందం. అదరగొట్టే మాస్ బీట్ తో యూత్ మరియు మాస్ ని షేక్ చేసేలా దేవిశ్రీప్రసాద్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసాడు. బ్లెజ్ మరియు రనిన రెడ్డి కలిసి పాడిన ఈ సాంగ్ కి శ్రీమణి సాహిత్యాన్ని అందించారు.
రాజేంద్ర ప్రసాద్, మురళి శర్మ, హరితేజ, బండ్ల గణేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ గా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11 న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.