HomeTelugu cinema

కృష్ణవంశీ సినిమాలో నటుడిగా రాహుల్ సిప్లిగంజ్
Published By :  Divya Valluru Image Image
Rahul Sipligunj to make his acting debut with Rangamarthanda
Monday Dec 02, 2019
బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ విజేత అయిన రాహుల్ సిప్లిగంజ్ సింగర్ గా మంచి పేరుతెచ్చుకున్నాడు. బిగ్ బాస్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న రాహుల్ ఇప్పుడు నటుడిగా కొత్త అవతారం ఎత్తనున్నాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘రంగమార్తాండ’ సినిమాలో రాహుల్ ఒక పాత్రలో మేరవనున్నాడు. ఈ విషయాన్నీ రాహుల్ ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.

"ఇలాంటి మహానటులు నటిస్తున్న గొప్ప చిత్రంలో నాకు అవకాశం రావడం చాలా గర్వంగా ఉంది. దర్శకుడు కృష్ణవంశీ గారికి కృతజ్ఞతలు. షూటింగ్ లో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. నటుడిగా ఇది తొలి ప్రయత్నం. మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నా’ అంటూ రాహల్ ట్వీట్ చేసాడు. 

మరాఠీలో ఘనవిజయం సాధించిన ‘నటసామ్రాట్’ చిత్రాన్ని కృష్ణవంశీ  ‘రంగమార్తాండ’ పేరుతో తెలుగులోకి రీమేక్ చేస్తున్నాడు. మరాఠీలో నానా పఠేకర్ పోషించిన పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించబోతున్నారు. రమ్యకృష్ణ, బ్రహ్మానందం ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.