HomeTelugu cinema

శ్రీమతిగా మారిన హీరోయిన్ మనాలి రాథోడ్
Published By :  Divya Valluru Image Image
Actress Manali Rathod ties knot with Ravi Vijjith
Monday Dec 02, 2019
ప్రముఖ దర్శకుడు వంశీ తెరకెక్కించిన 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైనా నటి మనాలి రాథోడ్ పెళ్లి చేసుకుంది. రవి విజ్జత్ అనే ఓ బిజినెస్ మేన్ ను ఆమె పెళ్లాడింది. ఎలాంటి హడావుడి లేకుండా జరిగిన ఈ పెళ్లికి టాలీవుడ్ కు చెందిన రాజశేఖర్, జీవిత, దర్శకుడు క్రిష్, హేమ తదితర కొందరు సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు.

'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' సినిమా తర్వాత మనాలి గ్రీన్ సిగ్నల్, ఓ స్త్రీ రేపు రా వంటి సినిమాలలో నటించినప్పటికీ ఆమెకు తగిన గుర్తింపు రాలేదు. ఆమెకు సినీ అవకాశాలు రాకపోవడంతో పెళ్లి చేసుకుని  సెటిల్ కావాలని నిర్ణయించుకుంది. పెళ్లి తర్వాత ఆమె సినీ ప్రయాణం మళ్లీ కొనసాగుతుందా? లేదా? అనేది వేచి చూడాలి.

సినీ నటి అర్చన కూడా ఇటీవలే పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. 

   Politics

   Lifestyle