HomeTelugu cinema

మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై కంప్లైంట్ చేసిన బిగ్ బాస్ భామ
Published By :  Divya Valluru Image Image
Bigg Boss fame Sanjana Anne files complaint on MLA Son
Monday Dec 02, 2019
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కొడుకు ఆశీష్ గౌడ్ మాదాపూర్‌లోని ఆరిస్ట్రీ పబ్‌లో బిగ్ బాస్ ఫేం సంజన అన్నే పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై ఆమె మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

వివరాల్లోకి వెళ్తే...బిగ్‌ బాస్‌–2 కంటెస్టెంట్‌ అన్నె సంజన తన స్నేహితులు వి.శివాణి, వి.సంజన , రమేష్‌లతో ఆదివారం తెల్లవారు జామున 2 గంటలకు నొవాటెల్‌లోని ఆర్టిస్ట్రీ పబ్‌కు వెళ్లింది.  మొదటి అంతస్తులోని టేబుల్‌ వద్ద సంజనా ఉండగా కింది ఫ్లోర్‌లో ఉన్న అశిష్‌ గౌడ్‌ 2.45 గంటలకు 8 మంది స్నేహితులు కలిసి పైకి వచ్చారు. మద్యం మత్తులో ఉన్న అశిష్‌ గౌడ్‌ నన్ను గుర్తు పట్టావా అని అడగ్గా లేదని సమాధానమిచ్చింది. దీంతో రెచ్చిపోయిన అతను మాటల్లో చెప్పలేని బూతులు తిడుతూ ఆమె పై మద్యం బాటిళ్లతో దాడి చేసాడు, తోసివేయడంతో ఓ దశలో కింది ఫ్లోర్‌లో పడిపోతానేమోనని భయమేసిందని, నా స్నేహితుడు అడ్డుకోవడంతో బయటపడ్డానని పేర్కొంది. 

పబ్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తే నిజం తెలుస్తుందని సంజన వెల్లడించారు. ఆశీష్ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న సమయంలో చుట్టూ ఉన్నవారెవ్వరూ అతన్ని వారించలేదని ఆరోపించారు. బౌన్సర్ల సమక్షంలోనే ఈ ఘటన జరిగిందని, వారు కూడా ఆశీష్‌ను పట్టించుకోలేదని వాపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆశిష్‌ గౌడ్‌పై సెక్షన్‌ 354, 354ఏ, 509 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

   Politics

   Lifestyle