HomeTelugu cinema

వైరల్ అవుతున్న రానా వింత లుక్
Published By :  Divya Valluru Image Image
Rana Daggubati new Instagram photo in Taller avatar goes viral
Saturday Nov 30, 2019
నిర్మాత సురేష్ బాబు తనయుడిగా లీడర్ సినిమాతో తెరంగేట్రం చేసిన రానా దగ్గుబాటి మొదటినుంచి విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ యువ కథానాయకుదిగా తనదైన ముద్ర వేసుకున్నాడు. చివరగా ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంలో చంద్రబాబునాయుడుగా కనిపించిన రానా ప్రస్తుతం 'విరాటపర్వం' అనే సినిమాలో నటిస్తున్నారు.  సాయి పల్లవి కథానాయికగా కనిపించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. 

సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండే రానా దగ్గుబాటి ఈ రోజు అభిమానుల కోసం తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఫోటో షేర్ చేసాడు. ఆ ఫోటోలో కాళ్లకు పొడవైన కర్రలు తగిలించుకుని రానా వింతగా కనిపిస్తున్నాడు. సర్కస్ లు, ఇతర వినోద కార్యక్రమాల్లో కొందరు కాళ్లకు పొడవైన కర్రలు అమర్చుకుని ఎంతో సమతుల్యంతో నడుస్తుంటారు. ఈ ఫొటోలో రానా కూడా అలాగే కర్రల సాయంతో మరింత పొడవుగా కనిపిస్తున్నాడు. 

రానా ఫోటో చూసిన అభిమాని ఒకతను ఉన్న హైట్ సరిపోలేదా అంటూ సరదాగా కామెంట్ చేసాడు.  

   Politics

   Lifestyle