HomeTelugu cinema

పారిస్ అందాలలో షూటింగ్ జరుపుకుంటున్న 'సామజ వరగమన'
Published By :  Divya Valluru Image Image
Allu Arjun and Pooja shooting in Paris for Samajavaragamana song
Friday Nov 08, 2019
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడుగా  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'అల వైకుంఠపురములో'. పూజ హెగ్డే కథానాయికగా కనిపించనున్న ఈ సినిమాను అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన 'సామజ వర గమన' పాట యూట్యుబ్ లో రికార్డులను సృష్టిస్తూ మోస్ట్ వాచ్డ్ సాంగ్ ఇన్ సౌత్ ఇండియాగా నిలిచింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం, సంగీత దర్శకుడు తమన్ అందించిన బాణీలు ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి.

ప్రస్తుతం ఈ 'సామజ వరగమన' పాటను ప్రస్తుతం పారిస్‌లోని పలు అందమైన ప్రదేశాలలో చిత్రీకరిస్తున్నారు. అల్లు అర్జున్, పూజ హెగ్డేలపై చిత్రీకరిస్తున్న ఈ పాటకు శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూరుస్తున్నారు. అల వైకుంఠపురములో సినిమాలో టబు, రాజేంద్రప్రసాద్, తనికెళ్ళ భరణి, సునీల్, నవదీప్, సుశాంత్, నివేదా పేతురాజ్, బ్రహ్మాజీలు ఇతర ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు.

ఈ సినిమాలోని మరో పాట 'రాములో రాములా' పాట కూడా యూట్యూబ్ లో దుమ్ములేపుతోంది. జియో అఫిషియల్ మ్యూజిక్ యాప్ జియో సావన్ లోనూ ఈ రెండు పాటలు ట్రెండింగ్ లో ఉన్నాయి.

   Politics

   Lifestyle