HomeTelugu cinema

అశోక్ గ‌ల్లా సరసన నిధి అగ‌ర్వాల్‌
Published By :  Lasya Raghavaraju Image Image
Niddhi Agarwal to romance Ashok Galla in his debut
Friday Nov 08, 2019
సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు,  ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, పార్ల‌మెంట్ స‌భ్యుడు జ‌య‌దేవ్ గ‌ల్లా త‌న‌యుడు అశోక్ గ‌ల్లా హీరోగా తెరంగేట్రం చేయనున్నాడు. "భలే మంచి రోజు' ఫేమ్‌ శ్రీరామ్‌ ఆదిత్య ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో అశోక్ డెబ్యూ  సినిమా నవంబ‌ర్ 10న పలువురు సినీ ప్ర‌ముఖు ల స‌మ‌క్షంలో ఘనంగా లాంచ్‌ కానుంది. 

తాజా సమాచారం ప్రకారం అశోక్ గ‌ల్లా సరసన రీసెంట్‌గా `ఇస్మార్ట్ శంక‌ర్‌` వంటి సూప‌ర్‌హిట్ చిత్రంలో న‌టించిన నిధి అగ‌ర్వాల్‌ను హీరోయిన్‌గా చిత్ర యూనిట్ ఖ‌రారు చేసింది. ఈ సినిమాలో అశోక్ పక్కన నటించేందుకు నిధి భారీగానే  పుచ్చుకుంతోందని వార్తలు వినిపిస్తున్నాయి. 

అమ‌ర్‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో ప‌ద్మావ‌తి గ‌ల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు న‌రేశ్‌, స‌త్య‌, అర్చ‌నా సౌంద‌ర్య ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తుండ‌గా రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

   Politics

   Lifestyle