HomeTelugu cinema

మందిరాకు రమ్యకృష్ణతో షాక్‌ ఇచ్చిన పూరి
Published By :  Lasya Raghavaraju Image Image
Mandira Bedi ousted from Puri's Romantic; Ramya Krishna takes her role
Friday Nov 08, 2019
డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి కథానాయకుడుగా రొమాంటిక్ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. . ఈ సినిమాతో పూరి శిష్యుడు అనిల్ పాడూరి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఆకాష్ సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ కుర్రకారుకి సెగలు పుట్టించిన సంగతి తెలిసిందే. 

తాజా సమాచారం ప్రకారం రొమాంటిక్ సినిమాలో బాలీవుడ్ నటి మందిర బేడి స్థానంలో ఇప్పుడు రమ్యకృష్ణను తీసుకున్నారట. మొదట మందిరా బేడీని పెట్టి కొన్ని సన్నివేశాలను తీశారు. అయితే ఈ మధ్యన ఆ సన్నివేశాల రషెస్ చూసిన పూరీ ఆ పాత్రకు మందిరా బేడీ న్యాయం చేయడంలేదని ఆమె స్థానంలో రమ్యకృష్ణ అయితే బాగుంటుందని ఆమెను తీసుకున్నారట. రమ్యకృష్ణ అయితే తెలుగు ప్రేక్షకులకు కూడా తొందరగా రీచ్ అవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రమ్యకృష్ణ తో మొదట నుంచి సన్నివేశాలను చిత్రీకరించటం వల్లే సినిమా కూడా లేట్ అవుతూ వస్తుందని ఫిలింనగర్ వర్గాలు అనుకుంటున్నాయి.

రొమాంటిక్ సినిమాని ఛార్మి, పూరి కలిసి నిర్మిస్తున్నారు.  

   Politics

   Lifestyle