HomeTelugu cinema

లైవ్ లో వచ్చి రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ప్రదీప్
Published By :  Divya Valluru Image Image
Anchor Pradeep gives clarity about his ill health on live
Friday Nov 08, 2019
యాంకర్ ప్రదీప్ మాచిరాజు తీవ్ర అనారోగ్యంతో భాధపడుతున్నాడని, అందుకే అతను బయట ఎక్కడ కనిపించట్లేదని సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.  ప్రదీప్ కి అసలు ఏమైందని అభిమానులు కూడా సాటి యాంకర్స్ దగ్గర ఆరాలు తీస్తున్నారు. అయితే తన ఆరోగ్యం పై జరుగుతున్న ప్రచారానికి పులిస్టాప్ పెట్టారు ప్రదీప్. 

గురువారం తన సోషల్ మీడియా పేజ్‌ లైవ్‌లో అభిమానులతో ముచ్చటించాడు. గత నెల రోజులుగా తనపై, తన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న పుకార్లపై క్లారిటీ ఇచ్చాడు. తనకి ఏమి కాలేదని, తన ఆరోగ్యంపై వచ్చిన వార్తలన్నీ ఒట్టి పుకార్లేనని ప్రదీప్ తేల్చేసాడు. 

"చాలా రోజుల నుంచి ఇంట్లో ఖాళీగా ఉండి ఉండి లైవ్ లు చేయాలనిపించింది. నా మీద అందరు చుపిస్తున్న ప్రేమ, అభిమానాలు ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. షూటింగ్ జరుగుతున్న సమయం లో కాలికి చిన్న గాయం అయ్యింది. డాక్టర్లు సర్జరీ చేసి ఎక్కువగా నిలుచోకూడదు అని సలహా ఇవ్వటం తో రెస్ట్ తీసుకుంటున్నాను. ఇంకో వారంరోజుల్లో వచ్చేస్తాను అని ప్రదీప్ చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా తన గురించి ఆలోచించి తనకు మెసేజ్‌లు, ఫోన్లు చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేశాడు ప్రదీప్‌.

   Politics

   Lifestyle