HomeTelugu cinema

పింక్ రీమేక్ పై పవన్ షాకింగ్ కామెంట్స్
Published By :  Divya Valluru Image Image
Pawan Kalyan refuses to talk about his comeback film
Friday Nov 08, 2019
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తిరిగి తెరంగేట్రం చేస్తారని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ పింక్ రీమేక్ చిత్రంలో నటిస్తున్నారనీ, ఈ చిత్రాన్ని దిల్ రాజు- బోనీకపూర్ నిర్మిస్తున్నారని కూడా ధ్రువీకరించారు. పింక్ చిత్రంలో లాయర్ పాత్రలో పవన్ నటించనున్నాడని దీనికి లాయర్ సాబ్ అనే పేరు అనుకుంటున్నారని వార్తలు కూడా వచ్చాయి. మరోవైపు రెమ్యునరేషన్ రూ. 50 కోట్లు అని కూడా ఫిలిమ్ నగర్లో చర్చ మొదలైంది.

అయితే ఈ వార్తలపై పవన్ కళ్యాణ్‌ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. రెండు రోజులక్రితం పవన్ ను పింక్ సినిమాపై క్లారిటీ ఇమ్మని అడిగితే ఆయన చికాకుపడ్డారట. అసలు తనను సంప్రదించకుండానే ఇలాంటి గాలి వార్తలు ఎలా వస్తున్నాయి. ఈ వార్తలు ఇలా వస్తుంటే సదరు నిర్మాతలు ఎలా మౌనం వహిస్తున్నారంటూ మండిపడ్డారట. పైగా తన సరసన నయనతార లేదా పూజా హెగ్దె నటించనున్నట్లు వచ్చిన వార్తలను చూసి పవన్ పకపకా నవ్వి, ఏంటివన్నీ అంటూ ప్రశ్నించారట.

నేను ఇక సినిమాల్లో నటించను అని భీష్మిస్తున్న పవన్ కళ్యాణ్ ను మళ్ళీ తెరపై చూడచ్చు అని సంబరపడిపోయిన అభిమానులు పవన్ చేసిన కామెంట్లను చూసి బాగా వర్రీ అయిపోతున్నారట. మరి, ఫ్యాన్స్ కోసమయినా చిత్రాలు చేస్తారో లేదంటే మొండికేస్తారో చూడాల్సిందే.

   Politics

   Lifestyle