HomeTelugu cinema

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎనిమిది పాటలు
Published By :  Lasya Raghavaraju Image Image
Rajamouli's highly awaited RRR to have eight songs
Thursday Nov 07, 2019
రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ అనే భారీ బ‌డ్జెట్ మల్టీస్టారర్ తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. అల్లూరి సీతారామ రాజు మరియు కొమురం భీంల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని రాజమౌళి స్వయంగా ప్రకటించాడు.  వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి నాటికి షూటింగ్ పూర్తి చేసి మూవీని జూలైలో రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నారు.

తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర వార్త బయ‌ట‌కి వ‌చ్చింది. ఇందులో ఉత్కంఠ రేపే స‌న్నివేశాల‌తో పాటు అల‌రించే పాట‌లు ఎనిమిది ఉంటాయ‌ట‌. ఆ పాట‌లు దేశ‌భక్తిని పెంచే పేట్రియాటిక్ సాంగ్స్ అని కొంద‌రు చెబుతుండ‌గా, వాటితో పాటు హీరో హీరోయిన్స్ మ‌ధ్య వ‌చ్చే రొమాంటిక్ సాంగ్స్ కూడా ఉంటాయ‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. సుద్దాల అశోక్ తేజ స్వాతంత్య్ర‌కాంక్ష‌ని పెంచే మూడు పాటలు రాస్తున్నార‌ని తెలుస్తుండ‌గా, మిగ‌తా పాటలు ప్ర‌ముఖ లిరిసిస్ట్స్ రాస్తున్న‌ట్టు టాక్. కీరవాణి చిత్రానికి సంగీతం అందిస్తున్న విష‌యం తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా బాలీవుడ్ నటి ఆలియా బట్ నటిస్తోంది. ఎన్టీఆర్ కి జోడీగా హీరోయిన్ ఖరారు కావాల్సివుంది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, తమిళ నటుడు సముతిరకని ఇతర ముఖ్య పాత్రలు పోషించనున్నారు. 

   Politics

   Lifestyle