HomeTelugu cinema

నా సినిమాలు వాళ్ళు చూడనవసరం లేదు : విద్య బాలన్
Published By :  Divya Valluru Image Image
Vidya Balan suggests her critics not to watch her movies
Wednesday Oct 09, 2019
బాలీవుడ్ నటి విద్యా బాలన్ మొదటినుంచి విలక్షణ పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విద్య నటించిన డర్టీ పిక్చర్’, ‘కహానీ’, ‘తుమారీ సులు’ చిత్రాలు ఆమెకు బాలీవుడ్ నాట మంచి పేరు తీసుకొచ్చాయి. ఆఖరిగా మిషన్ మంగళ చిత్రంలో సైంటిస్ట్ పాత్రలో మెరిసిన విద్య బాలన్ ప్రస్తుతం హ్యూమన్ కంప్యూటర్‌గా పేరుగాంచిన గణితవేత్త శకుంతలా దేవి జీవితాధారంగా తెరకెక్కుతున్న 'శకుంతలా దేవి' చిత్రంలో నటిస్తోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విద్య తనపై కామెంట్స్ చేసేవారికి గట్టి బుద్ధిచెప్పారు. 

‘నేనంటే ఇష్టంలేని వారు నేను నటించే సినిమాలు కూడా చూడనక్కర్లేదు. డర్టీ పిక్చర్, కహానీ సినిమాల తర్వాత నేను సొంతంగా సినిమాలను ఎంపిక చేసుకోవడం నేర్చుకున్నాను. నా బోల్డ్‌నెస్‌తో నేను అన్ని భాషల్లోనూ నటిస్తున్నాను. నేను ఎంపిక చేసుకునే సినిమాలు కొందరికి నచ్చుతాయి, కొందరికి నచ్చవు. నేనంటే ఇష్టం లేని వారు నా సినిమాలు చూడాల్సిన అవసరం లేదు కదా..’ అని వెల్లడించారు.

'శకుంతలా దేవి - హ్యూమన్ కంప్యూటర్' చిత్రాన్ని సోని పిక్చర్స్ నెట్‌వర్క్స్, విక్రమ్ మల్హోత్రా నిర్మిస్తుండగా, అను మీనన్ డైరెక్ట్ చేస్తున్నారు.ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.