HomeTelugu cinema

ఎంత మంచివాడవురా టీజర్ బాగానే ఉంది
Published By :  Divya Valluru Image Image
Kalyan Ram's Entha Manchivaadavuraa teaser looks interesting
Wednesday Oct 09, 2019
నందమూరి కళ్యాణ్ రామ్ తాజా చిత్రానికి ఎంత మంచివాడవురా అనే టైటిల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మెహ్రీన్ కథానాయికగా నటిస్తున్న ఈ  సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. ఎంత మంచివాడవురా టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. 

ఒక నిమిషం 8 సెకండ్ల నిడివిగల టీజర్ ఆసక్తికరంగానే ఉంది. కళ్యాణ్ రామ్ ను ఒక్కొక్కరు ఒక్కో రకమైన పేరుతో పిలుస్తూ.. మంచి వాడు అని చెప్తుంటే.. బ్యాక్ గ్రౌండ్ లో ఫైట్ జరుగుతుంటుంది.  అందరు మంచివాడు మంచి వాడు అంటుంటే.. నువ్వెంట్రా అలా కొడుతున్నావ్ అని అంటే.. రాముడు మంచివాడేరా.. కానీ రావణాసురుడిని వేసేయ్ లా అని చెప్పడంతో సినిమా ఎలా ఉండబోతుందో అన్నది తేలిపోయింది.

మళ్లీ ఎప్పుడు వస్తావ్ రా అంటూ తణికెళ్ల భరణి అడిగిన వెంటనే సంక్రాంతికి నాన్న అని చెప్పడం వెనుక సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు అర్ధం అవుతుంది. చెడ్డకు చెడు.. మంచికి మంచి అనే కాన్సెప్ట్ ఈ సినిమాలో చూపిస్తున్నాడు సతీష్.