HomeTelugu cinema

నాన్ బాహుబలి రికార్డ్ చెరిపేసిన సైరా
Published By :  Lasya Raghavaraju Image Image
Chiranjeevi's Sye Raa crosses 100 Crores
Wednesday Oct 09, 2019
మెగాస్టార్ చిరంజీవి స్వాతంత్ర్య సమరోయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించిన ప్రాతిష్టాత్మక చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి అక్టోబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అయి వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా సైరా 7 రోజుల్లో దాదాపు 110 కోట్ల షేర్ వసూలు చేసింది. తొలి వారం వసూళ్లలో బాహుబలి 2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన ఘనత ఈ చిత్రంతో చిరంజీవి అందుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 7 రోజుల్లో 82 కోట్లకి పైగా షేర్ వసూలు చేసింది. దసరా రోజున మరోసారి ఈ చిత్రానికి అద్భుతమైన వసూళ్లు వచ్చాయి.  రెండవ వారంలో పోటీనిచ్చే సినిమా ఏదీ లేకపోవడం, మరి కొన్ని వారాల వరకు పెద్ద సినిమాలేవీ రాకపోవడం వల్ల సైరా నరసింహారెడ్డికి లాంగ్‌ రన్‌ వుంటుందని ట్రేడ్‌ ప్రిడిక్ట్‌ చేస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కన్నడలో కూడా అదరగొడుతుంది సైరా.  

రీఎంట్రీలో వరుసగా రెండు వంద కోట్ల షేర్‌ తెచ్చిన చిత్రాలతో చిరంజీవి తన సత్తా ఏమిటనేది చూపించారు.