HomeTelugu cinema

చిరు-కొరటాల సినిమా ప్రారంభమైంది
Published By :  Lasya Raghavaraju Image Image
Chiranjeevi's 152nd film under Koratala direction launched
Tuesday Oct 08, 2019
విజయదశమి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి 152 వ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. సైరా నరసింహారెడ్డి హిట్‌తో మంచి జోష్‌ మీద ఉన్న చిరుని కొరటాల శివ మొదటిసారి డైరెక్ట్ చేయబోతున్నారు.  ఇంకా పేరుపెట్టని ఈ సినిమా యొక్క పూజ కార్యక్రమం చిరంజీవి కుటుంబసభ్యుల సమక్షంలో హైదరబాద్ లో ఈ ఉదయం జరిగింది. 

మెగాస్టార్ భార్య సురేఖ మొదటి క్లాప్‌ కొట్టారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్టు చిత్రయూనిట్ తెలిపింది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిపి కొణిదెల ప్రొడక్షన్స్‌ ఈ సినిమా నిర్మిస్తోంది. ఈ సినిమాలో చిరంజీవితో క‌లిసి రామ్ చ‌ర‌ణ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడ‌నే వార్తలు వినిపిస్తున్నాయి.  క‌థ‌లో ఫ్లాష్ బ్యాక్  భాగంలో ఓ ప‌వ‌ర్ ఫుల్ రోల్ చ‌ర‌ణ్ కోసం డిజైన్ చేశాడట కొర‌టాల‌. ఆ పాత్ర చ‌ర‌ణ్ త‌ప్ప వేరే ఎవ‌రు చేసినా కూడా సూట్ కాద‌ని భావిస్తున్నాడట. అందుకే ఆయ‌న్ని ఒప్పించి ఫ్లాష్ బ్యాక్‌లో వ‌చ్చే ఈ పాత్ర చ‌ర‌ణ్‌తో చేయించాల‌ని చూస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.

చిరు-చరణ్ క‌లిసి ఇప్పటికే మూడుసార్లు ఒకే స్క్రీన్‌పై క‌నిపించారు. ప‌దేళ్ల కింద ‘మ‌గ‌ధీర‌’లో త‌న‌యుడితో క‌లిసి న‌టించిన చిరు, ఆ త‌ర్వాత మూడేళ్ల కింద ‘బ్రూస్లీ’లో మ‌రోసారి మెరిశాడు. చరణ్ ఏమో ‘ఖైదీ నెం.150’లో పాట‌లో చిరుతో కలిసి రెండు స్టెప్పులేసాడు. ఇక ఇప్పుడు నాలుగోసారి చిరు, చ‌ర‌ణ్ క‌లిసి ఈ సినిమాలోనే నటించబోతున్నారని అంటున్నారు.