HomeTelugu cinema

రచ్చ రేపుతున్న వెంకీ మామ టీజర్
Published By :  Lasya Raghavaraju Image Image
Venkatesh-Naga Chaitanya's Venky Mama teaser released
Tuesday Oct 08, 2019
విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య ప్రాధాన పాత్రల్లో కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెంకీ మామ చిత్రం యొక్క ట్రైలర్ ఈ రోజు దసరా సందర్భంగా విడుదలైంది.  ఇందులో వెంకటేష్ రైస్ మిల్ ఓనర్‌గా.. నాగచైతన్య సైనికుడిగా నటిస్తున్నారు. నలబై సెకండ్ల టీసర్ కలర్‌ఫుల్‌గా ఉంది. 

గోదావ‌రిలో ఈత నేర్పా.. బ‌రిలో ఆట నేర్పా.. ఇప్పుడు జాత‌ర‌లో వేట నేరిస్తా.. అంటూ చైతన్య తో వెంకీ చెప్పే డైలాగ్ అభిమానులను అలరించింది. చివ‌ర్లో `ఐ ల‌వ్ యూ అనేసిందిరా అల్లుడూ` అంటూ త‌న‌దైన కామిక్ టైమింగ్‌తో అదరగొట్టాడు. అయితే ఈ క‌థ‌కు సంబంధించిన లైన్ మాత్రం రివీల్ కాకుండా ద‌ర్శ‌కుడు జాగ్ర‌త్త ప‌డ్డాడు. 

గతంలో ప్రేమమ్ సినిమాలో చైతన్య మామగా వెంకటేష్ కనిపించాడు.  ఈ సినిమాలో మరొకసారి మామా, అల్లుళ్ళుగా అదరగొట్టబోతున్నారు.

రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. త్వరలోనే విడుదల కానుంది వెంకీ మామ.

   Politics

   Lifestyle