HomeTelugu cinema

ఉయ్యాలవాడ ఫోటో రహస్యం చెప్పేసిన చిరు
Published By :  Divya Valluru Image Image
Chiranjeevi intersting comments on Uyyalawada Narasimha Reddy photo
Tuesday Oct 08, 2019
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సైరా నరసింహారెడ్డి సినిమా అక్టోబర్ 2న విడుదలై ఘన విజయమ సాధించింది. రేనాటి ఉద్యమ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి అద్భుత నటనను కనపరిచి విశ్లేషకుల ప్రసంసలు దక్కించుకున్నాడు. సైరా చిత్రం సెట్లపైకి వెళ్లినప్పుడు ఒక బ్లాక్ అండ్ వైట్ ఫొటో మీడియాలో చక్కర్లు కొట్టింది. మెలితిరిగిన మీసాలు, తలపాగా, అంగారఖా, చేతిలో పొన్నుకర్ర పట్టుకుని నిల్చున పాలెగాడి ఫోటో అది. ఈ చిత్రం  ఉయ్యాలవాడ నరసింహారెడ్డిది అని అప్పట్లో ప్రచారం చేశారు. 

అయితే నిన్న జరిగిన ‘సైరా’ చిత్రం సక్సెస్ మీట్‌‌లో చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిదిగా చెప్పబడుతున్న ఫోటో ఎవరిదో చెప్పారు. ‘ఆ ఫొటో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిది అని అందరూ కుంటున్నారు. కానీ అది నిజం కాదు. అది నరసింహారెడ్డి మనవడి ఫొటో. అతనికి నరసింహారెడ్డి పోలికలు ఉండడంతో కుటుంబ సభ్యులు నరసింహారెడ్డి వేషం వేసి ఫొటో తీయించారు. ఈ విషయంపై తనకు కూడా క్లారిటీ లేదని.. కేవలం కుటుంబ సభ్యులు చెప్పింది మీకు పోస్ట్ చేస్తున్నానని తెలిపాడు చిరంజీవి.

1840ల ప్రాంతంలో మన దేశంలో, అందులోనూ రాయలసీమ ప్రాంతంలో ఫొటోగ్రాఫర్లు లేకపోవడంతో కొంతమంది అది నరసింహారెడ్డిది ఫోటో కాదని వాదించారు. ఇప్పుడు చిరు కూడా ఆ ఫోటో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫోటో కాదని చెప్పేసరికి షాక్ అవ్వడం ప్రేక్షకుల వంతయింది.