HomeTelugu cinema

రాజు గారి గది 3 విడుదల తేది ఖరారు
Published By :  Lasya Raghavaraju Image Image
Raju Gari Gadhi 3 release date finalized on October 18
Tuesday Oct 08, 2019
హర్రర్​ కామెడీ కథాంశంతో దర్శకుడు ఓంకార్ తీసిన 'రాజుగారి గది', 'రాజుగారి గది 2' చిత్రాలు ప్రేక్షకుల్ని బయపెట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించాయి. ఇప్పుడు 'రాజుగారి గది 3' తో మరోసారి ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు.​ ఓంకార్ తమ్ముడు అశ్విన్ హీరోగా, 'ఉయ్యాల జంపాల'తో ఆకట్టుకున్న అవికా గోర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొంది. 

ఈ మధ్యన విడుదలైన 'రాజుగారి గది 3' ట్రైలర్ ఆకట్టుకొంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించారు నిర్మాతలు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రం అక్టోబర్ 18 న విడుదల కానుంది.  ఊర్వశి, హ‌రితేజ‌, అలీ, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను,  అజ‌య్‌ ఘోష్ ఇత‌ర పాత్రల్లో న‌టిస్తున్నారు. 

ఓక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై నిర్మించిన ఈ హారర్ చిత్రానికి షబీర్ సంగీతం అందిస్తున్నాడు. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు.