HomeTelugu cinema

హృతిక్ వీర్యదానం చేస్తే పిల్లల్ని కంటానంటున్న క్రికెటర్
Published By :  Divya Valluru Image Image
Cricketer Bhavana demands sperm donation from Hrithik Roshan
Tuesday Oct 08, 2019
గ్రీకు వీరుడిలా ఉండే బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌కు దేశమంతటా అభిమానులు ఉన్నారు. తన డాన్స్, నటన,ఫైట్స్ తో హృతిక్ అమ్మాయిల మనసులను దోచుకున్నాడు. హృతిక్ తాజా చిత్రం వార్ గాంధీ జయంతి సందర్బంగా విడుదలై ఘన విజయం సాధించింది. తమిళనాడుకు చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారిణి భావన మొన్న వార్ సినిమా చూసి హృతిక్ పై విపరీతంగా మనసు పారేసుకుంది. ఈ అమ్మడు ఏకంగా హృతిక్‌ తో పిల్లలు కనాలని వుందని, ఆయన తనకు వీర్యదానం చేయాలని బాహటంగా ట్వీట్ చేసింది.

"వార్ సినిమా చూసిన మగ అభిమానులు చిత్రంలోని ఫైట్స్, ఛేజింగ్‌ సన్నివేశాలు చూసి ఆనందిస్తున్నారు.  మహిళా అభిమానులు మాత్రం నటుడు హృతిక్‌రోషన్, మరో నటుడు టైగర్‌ను చూసి ఎంజాయ్‌ చేస్తారని పేర్కొంది.  హృతిక్ తో పిల్లలు కనాలని ఉందని, అందుకు హృతిక్ రోషన్ సహకరించాలని పేర్కొంది. తాను చాలా క్లారిటీగా చెబుతున్నానని" భావన స్పష్టంచేసింది.

ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.