HomeTelugu cinema

కొండారెడ్డి బురుజు దగ్గర గొడ్డలి పట్టుకొని నిలుచున్న మహేష్
Published By :  Lasya Raghavaraju Image Image
Mahesh Babu Sarileru Neekevvaru mass poster released
Monday Oct 07, 2019
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరూ వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత విడుదల కాబోతోంది. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ అధికారిగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మాస్ లుక్ పోస్టర్ ను కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు.  

మహేష్ బాబు కొండారెడ్డి బురుజు దగ్గర గొడ్డలి పట్టుకొని నిలబడే లుక్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. మాస్ ను ఆకట్టుకోవడానికి పోస్టర్ ను డిజైన్ చేసినట్టు ఉంది.   అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తుంది.  పక్కా ఎంటర్టైనర్ అయినప్పటికీ మాస్ కు నచ్చే అన్నిరకాల మసాలాలు ఉంటాయని చెప్పేందుకే ఈ లుక్ ను డిజైన్ చేసి ఉండొచ్చు.

అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.