HomeTelugu cinema

ప్రభాస్ కోసం సెల్ టవర్ పైకెక్కిన యువకుడు
Published By :  Lasya Raghavaraju Image Image
Diehard Prabhas fan climbs demanding meeting with Saaho actor
Wednesday Sep 11, 2019
అభిమానులు తమ ఫేవరేట్‌ హీరోలను కలుసుకునేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. తమ అభిమాన తారతో ముచ్చటించాలని, వారితో కరచాలనం చేయాలనీ తాపత్రయ పడిపోతుంటారు. ఇప్పుడు తాజాగా యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ వీరాభిమని ఒకడు ప్రభాస్ ను కలవాలని ఏ కంగా సెల్‌ టవర్‌ ఎక్కాడు.  ప్రభాస్‌ వస్తేనే టవర్‌ దిగుతానని, లేకపోతే దూకి చస్తానని బెదిరిస్తున్నాడు. ఈ ఘటన జనగామలో జరిగింది.

జనగామ జిల్లా యశ్వంత్‌పుర పెట్రోల్‌ బంక్‌ పక్కన ఉన్న రిలయన్స్‌ సెల్‌ టవర్‌పైకి గుగులోతు వెంకన్న అనే యువకుడు ఎక్కాడు. వెంకన్నది మహబూబాబాద్‌, అతడు ప్రభాస్‌ అభిమాని అని తెలుస్తోంది. ప్రభాస్‌ అంటే ఇష్టమని, ప్రభాస్‌ను చూడాలని ఉందని, తనను చూసేందుకు, కలిసేందుకు ప్రభాస్‌ రాకపోతే సెల్‌ టవర్‌ పై నుంచి దూకేస్తానని వెంకన్న బెదిరిస్తున్నాడు.  అత్యంత ప్రమాదకరంగా సెల్‌ టవర్‌ అంచు మీద నిలబడి ఉన్న యువకుడిని బతిమాలి కిందికి దించేందుకు ప్రయత్నిస్తున్నారు స్థానికులు మరియు పోలీసులు. 

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

   Politics

   Lifestyle