HomeTelugu cinema

అనుష్క నిశ్శబ్దం ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదే
Published By :  Divya Valluru Image Image
Anushka Nishabdam first look poster out
Wednesday Sep 11, 2019
ఓవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు, మరోవైపు భారీ బడ్జెట్ సినిమాల్లో రాణిస్తున్న అనుష్క మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.'భాగమతి’ సినిమా తర్వాత అనుష్క శెట్టి నటిస్తున్న చిత్రం ‘నిశ్శబ్ధం’. హేమంత్ మధుకర్ దర్శక‌త్వంలో రూపొందుతున్న ఈ సైలెన్స్ థ్రిల్లర్ షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిసీగా ఉంది.  ఈ సినిమా సన్నివేశాలు దాదాపు అంతా విదేశాల్లోనే చిత్రీకరించారు. 

నిశ్శబ్దం సినిమాలో అనుష్క పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో సాక్షి అనే మూగ ఆర్టిస్ట్ పాత్రలో నటిస్తోంది. పెయింటింగ్ ద్వారానే తను తన మ‌న‌సులోని మాట‌ల‌ని చెబుతున్నట్టుగా అనిపిస్తోంది. కత్తిరించిన జుట్టుతో అనుష్క లుక్ పూర్తి డిఫరెంట్ గా వుంది. ఈ సినిమాలో ఆర్.మాధవన్, అంజలి, హాలీవుడ్ నటుడు ఖేల్‌మ్యాడ్‌సన్, షాలినిపాండే, శ్రీనివాస్ అవసరాల ఇతర పాత్రలు పోషిస్తున్నారు. 

ఈ చిత్రాన్ని టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్ కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, ఇంగ్లీష్, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.