HomeTelugu cinema

రాజశేఖర్ కి జోడీగా అమలా పాల్
Published By :  Divya Valluru Image Image
Amala Paul set to romance Rajasekhar in his next
Wednesday Sep 11, 2019
పిఎస్‌వి గరుడ వేగ, కల్కి లాంటి చిత్రాలతో విజయాలను దక్కించుకున్న యాంగ్రీ స్టార్‌ రాజశేఖర్‌ కథానాయకుడిగా ప్రదీప్‌ కృష్ణమూర్తి ద‌ర్శ‌క‌త్వంలో క్రియేటివ్‌ ఎంటర్‌టైనర్స్‌ -డిస్ట్రిబ్యూటర్స్‌ పతాకంపై జి. ధనుంజయన్‌ ఓ చిత్రాన్ని నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్ర షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అయితే ఇటీవ‌లే ఆ సినిమా కు పనిచేసే సాంకేతిక నిపుణులు, ఇత‌ర వివ‌రాలు వెల్ల‌డించారు. కానీ హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది మాత్రం రివీల్ చేయ‌లేదు.

తాజా సమాచారం ప్రకారం రాజశేఖర్ స‌ర‌స‌న హీరోయిన్ గా నటించే  ఛాన్స్ అమలాపాల్ దక్కించుకుందట. చాల మంది కథానాయికల పేర్లను ప‌రిశీలించి చివ‌రిగా ఆ పాత్ర‌కు అమ‌లా అయితేనే న్యాయం చేయ‌గ‌ల‌ద‌ని ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌లే అమ‌లాపాల్ త‌మిళ సినిమాలో `ఆడై`తో సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. న‌గ్నంగా న‌టించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకుంది. విడాకుల త‌ర్వాత అవ‌కాశాలు త‌గ్గిన నేప‌థ్యంలో ఆడైతో సంచ‌ల‌నం సృష్టించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఆడై స‌క్సెస్ తో అవ‌కాశాలు బాగానే వ‌స్తున్నాయి. 

తెలుగు లో ఆమె అనే టైటిల్ తో రిలీజ్ అయిన ఆడై చిత్రం ఇక్కడ ఆద‌రణ‌కు నోచుకోలేదు.

   Politics

   Lifestyle