HomeTelugu cinema

నాగ్ అశ్విన్ తో చేతులు కలిపిన విజయ్ దేవరకొండ
Published By :  Divya Valluru Image Image
Vijay Devarakonda team up with Nag Ashwin for third time
Tuesday Sep 10, 2019
టాలెంటెడ్ నటుడు విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' చిత్రంతో అనుకున్న విజయం అందుకోలేకపోయాడు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ పనులతో యమా బిజీగా ఉన్నాడు. అలాగే విజయ్ త్వరలో పూరి జగానాథ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. 

తాజా సమాచారం ప్రకార విజయ్ దేవరకొండ మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తో మూడో సారి కలిసి పనిచేయడానికి సిద్దమయ్యాడు.  నాగ్ అశ్విన్ దర్శకుడిగా పరిచయం అయిన ఎవడె సుబ్రహ్మణ్యం చిత్రం విజయ్ దేవరకొండకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అలాగే మహానటిలో కూడా విజయ్ దేవరకొండకి విజయ్ అంటోనీ అనే కీలక పాత్ర ఇచ్చాడు నాగ్ అశ్విన్. 

నాగ్ అశ్విన్ కు మహానటి తో  జాతీయ స్థాయిలో పేరొచ్చింది. ఇటీవలే జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు నాగ్ తన తదుపరి చిత్రంలో లీడ్ రొల్ కోసం విజయ్ దేవరకొండ ను ఎన్నుకున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఒక కొలిక్కి రావడంతో త్వరలోనే వీరి హ్యాట్రిక్ చిత్రం పట్టాలెక్కబోతున్నట్లు సమాచారం.

   Politics

   Lifestyle