HomeTelugu cinema

కనక దుర్గమ్మ ని దర్శించుకున్న నాని
Published By :  Divya Valluru Image Image
Nani offers prayers at Vijayawada Kanaka Durga temple
Tuesday Sep 10, 2019
ఈ నెల 13 న ప్రేక్షకుల ముందుకు రానున్న 'నానిస్‌ గ్యాంగ్ లీడర్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయవాడ వచ్చిన సినీ నటుడు నాని ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న కనక దుర్గమ్మ ని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం అమ్మవారి దర్శనం కోసం వచ్చిన నానీకి ఆలయ వర్గాలు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసారు. 

అమ్మవారి దర్శనం అనంతరం నానీకి ఆలయ అధికార వర్గాలు అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించాయి. ఈ సందర్భంగా నాని దశాంజనేయ ఆలయాన్ని కూడా సందర్శించారు.

వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నానిస్‌ గ్యాంగ్‌ లీడర్‌’ చిత్రంలో నాని సరసన్ మలయాళం అమ్మాయి ప్రియా హీరోయిన్ గా నటిస్తోంది. RX 100 హీరో కార్తికేయ విలన్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నాని రైటర్ గా కనిపించబోతున్నాడట.  మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. 

   Politics

   Lifestyle