HomeTelugu cinema

చిరంజీవికి గొంతు అరువిచ్చిన అరవింద్ స్వామి
Published By :  Lasya Raghavaraju Image Image
Aravind Swamy to lend his voice for Sye Raa Tamil
Tuesday Sep 10, 2019
మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రం సైరా నరసింహారెడ్డి షూటింగ్ పూర్తి చేసుకొని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. చరిత్ర పుటల్లో కాన‌రాని రేనాటి సూర్యుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌గాథ‌ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 2న తెలుగు,తమిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల చేయబోతున్నారు. 

ఈ నేపథ్యంలో సైరా తమిళ వెర్షన్ కు చిరంజీవి పాత్రకి ఎవరు డబ్బింగ్ చెబుతారనే సస్పెన్స్ ఉండేది. తాజా సమాచారం ప్రకారం తమిళ సైరాలో మెగాస్టార్ కు అరవింద్ స్వామి డబ్బింగ్ చెప్పనున్నాడట. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ధృవ సినిమాలో చ‌ర‌ణ్‌, అర‌వింద‌స్వామి క‌లిసి ప‌నిచేశారు. అప్ప‌టి నుండి ఇద్ద‌రి మ‌ధ్య మంచి అనుబంధం ఏర్పడింది.  ఇప్పుడు సైరాకు కూడా డైరక్టర్ సురేందర్ రెడ్డి. దీంతో ఆయన తమిళ వెర్షన్ లో చిరంజీవి వాయిస్ కు అరవింద్ స్వామి అయితే బాగుంటుందని చరణ్ తో మాట్లాడి ఒప్పించాడు. 

ఇంటెన్స్ తో కూడిన డైలాగ్స్ చెప్పడంలో ఆరవింద్ స్వామి దిట్ట కాబట్టి చిరు కూడా అరవింద్ స్వామి గొంతుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.  మరో విషయం ఏంటంటే, సైరా తమిళంలో కమల్ హాసన్ వాయిస్ కూడా వినిపించబోతోంది. సినిమా మొదట్లో కమల్ హాసన్ వాయిస్ వినిపిస్తుంది. తెలుగులో ఈ వాయిస్ ఓవర్ ను పవన్ కల్యాణ్ ఇచ్చిన విషయం తెలిసిందే.

   Politics

   Lifestyle