Image
మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ సతీమ‌ణి ఉపాసన కొణిదెల `యువర్ లైఫ్` వెబ్ పోర్టల్‌ను నిర్వహిస్తూ ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో విషయాలు వెల్లడిస్తున్నారు. ప్రకృతి అనుకూలమైన జీవనం, సంపూర్ణ ఆరోగ్యం, మానసిక, భావోద్వేగాల సమతుల్యత వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్న ఈ వెబ్ పోర్టల్ కి మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా ఉపాస‌న ఉండ‌గా, ప‌లువురు సెల‌బ్రిటీల‌ని గెస్ట్ ఎడిట‌ర్‌లుగా పిలిపించి వారిచే వంటలు చేపిస్తుంది. 

అక్కినేని కోడలు స‌మంత‌తో ఆరోగ్య‌క‌ర‌మైన వంటలు వండించిన ఉపాస‌న తాజాగా రష్మిక‌తో చేయించింది. రష్మిక చికెన్‌తో `కోలీ పుట్టు` ... read more>>
Image
టాలీవుడ్‌లో వరుస హిట్స్ అందుకుంటూ క్రేజీ హీరోయిన్‌గా కొనసాగుతున్న కన్నడ భామ రష్మికా మందన్న కార్తి సరసన సుల్తాన్ అనే సినిమాతో కోలీవుడ్ అరంగేట్రం చేయబోతోంది.  ‘రెమో’ ఫేమ్ బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. 

తాజా సమాచారం ప్రకారం రష్మికకు కోలీవుడ్‌లో మొదటి సినిమా విడుదలవక ముందే మరో క్రేజీ ఆఫర్‌ వరించిందట. కార్తి సోదరుడు, ప్రముఖ హీరో సూర్య సరసన రష్మిక ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.  పాండిరాజ్‌, ... read more>>
Image
జమ్మూ కాశ్మీర్లో భుదవారం తెల్లవారుఘామున భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్యన జరిగిన ఎన్ కౌంటర్ లో జైష్-ఎ-మహ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ కాల్పుల ఘటనలో మరో కానిస్టేబుల్ గాయపడ్డారు. 

జమ్మూకశ్మీర్‌లోని నాగ్రోటాలోని బాన్ టోల్ ప్లాజా సమీపంలో తెల్లవారు జాము నుంచి  భద్రతాదళాలపై పాక్‌ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య దాదాపు 4 గంటలు భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.  వారి నుంచి మొత్తం 11 ఎకె ... read more>>
Image
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు దీపావళికి ముందు ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ షాపింగ్‌తో పాటు పిల్లలతో ఆడిపాడాడు. దానికి సంబంధించిన ఫోటోలను మహేష్ బాబుతో పాటు నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉన్నారు. ఈ దీపావళిని నమ్రత, సితార, గౌతమ్‌లతో పాటు నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ కుటుంబంతో కలిసి విదేశాల్లో జరుపుకున్నారు.  తాజాగా మహేష్ సూపర్ స్టైలిష్ పిక్ ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు నమ్రత. 

మహేష్ బాబు దుబాయి ఎయిర్‌పోర్ట్‌లో ఉదయం 3 గంటలకు ... read more>>
Image
ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో హథ్రాస్‌ దారుణం మరువకముందే మరో దారుణం చోటు చేసుకుంది. ఘతంపూర్‌లో ప్రాంతంలోఆరేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం చేసి దారుణంగా చంపేశారు. అక్కడితో ఊరుకోక బాధితురాలి ఊపిరితిత్తులను బయటకు తీసి వాటితో క్షుద్ర పూజలు నిర్వహించారు. 

పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం.. . మరణించిన చిన్నారి దీపావళి పండుగ నాడు టపాకుల కోసం బయటకు వెళ్లింది. తిరిగి ఇంటికి రాలేదు. పండుగ హడావుడిలో ఉన్న కుటుంబ సభ్యులు సాయంత్రం చిన్నారి కోసం చుట్టు పక్కల ప్రాంతాలన్ని గాలించారు. సమీపంలో ఓ అడవి ... read more>>
Image
తమిళ స్టార్ హీరో సూర్య, అపర్ణ బాలమురళి జంటగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన సూరారై పోట్రూ దీపావళి కానుకగా ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ టాక్ ను దక్కించుకుంది. తెలుగు లో 'ఆకాశం నీ హద్దురా' గా విడుదలైన ఈ సినిమా థియేటర్లలో గాని  విడుదల అయివుంటే  ఖచ్చితంగా వంద కోట్లను వసూళ్లు చేసిది అంటూ ప్రేక్షకులు మరియు విశ్లేషకులు నమ్మకంగా చెబుతున్నారు.  డెక్కన్ ఎయిర్వేస్ అధినేత జీఆర్ గోపీనాథ్ జీవిత కథతో రూపొందిన ఈ సినిమాకి సూర్య నిర్మాతగా కూడా ... read more>>
Image
యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ రెండోసారి క్వారంటైన్‌లోకి వెళ్లారు. ప్రధానిని కలిసిన చట్టసభ్యుల బృందంలోని కన్జర్వేటివ్ పార్టీ సభ్యుడు లీ అండర్సన్‌కు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా బోరిస్ జాన్సన్ సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. 

కరోనా రోగిని ప్రధాని కలిసిన నేపథ్యంలో కరోనా వైరస్ బారిన పడే ముప్పు ఉన్నందున ఎన్‌హెచ్ఎస్ టెస్ట్, ట్రేస్ బృందాల సూచనల మేరకు ముందుజాగ్రత్తతో స్వీయ నిర్బంధంలో ఉంటారని డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. తనకు కరోనా లక్షణాల్లేవని, కానీ నిబంధనలు పాటిస్తున్నట్టు ... read more>>
Image
“ఆర్ ఎక్స్ 100 “మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శర్వానంద్ హీరోగా యాక్షన్ తెరకెక్కనున్న ఎంటర్టైనర్ "మహాసముద్రం".  తెలుగు , తమిళ భాషలలో ద్విబాషా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరో సిద్ధార్ధ్ ఒక కీలక పాత్ర పోషించనున్నాడు. ఏడు సంవత్సరాల తరువాత సిద్ధార్ధ్ టాలీవుడ్ కు రీ ఎంట్రీ కావడం విశేషం. 

అదితి రావు హైదరీ , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. “మహాసముద్రం ” మూవీ థీమ్ ... read more>>
Image
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. క్రేజీ బ్యూటీ ర‌ష్మిక మందన్న హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ చిత్తూరు జిల్లాకు చెందిన లారీ డ్రైవ‌ర్‌గా మాస్ పాత్రలో క‌నిపించ‌బోతున్నాడు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సాగ‌నున్న ‘పుష్ప’ చిత్ర షూటింగ్ నిన్న తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ప్రారంభమైంది.

పుష్ప సినిమాలో విలన్ పాత్రలో ఎవరు నటిస్తున్నారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ముందుగా తమిళ నటుడు విజయ్ సేతుపతి ... read more>>
Image
శీతాకాలం వచ్చిందంటే చాలు కొందరికి గొంతునొప్పి చాలా ఇబ్బంది పెడుతుంది. గొంతులో ఇన్‌ఫెక్షన్‌ కారక సూక్ష్మక్రిములు ఏర్పడటం వలన గొంతునొప్పి (త్రోట్‌ పెయిన్‌) మొదలవుతుంది. అలాగే చల్లటి పానీయాలు, చల్లటి తేమగాలి పడకపోవడం వల్ల, అలర్జీలు, స్మోకింగ్, జలుబు, దగ్గు, ఫ్లూ మొదలగు కారణాలతో గొంతునొప్పి వచ్చి వేధిస్తుంది. 

గొంతు నొప్పితో పాటు, గొంతులో కిచ్ కిచ్, దురద, ఇరిటేషన్ , గొంతు, మెడ చుట్టూ వాపు వంటి లక్షణాలు కనబడుతాయి. ఆహారాన్ని  మింగుతుంటే చాలా ఇబ్బందిగా వుంటుంది. దీన్ని నివారించేందుకు ఈ క్రింది ... read more>>

   Politics

   Lifestyle