Image
భారతదేశంలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే వుంది. సామాన్య ప్రజలతో పాటు ఎందరో రాజకీయ ప్రముఖులు, కేంద్ర మంత్రులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మరో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ కరోనా వైరస్ బారిన పడ్డారు. తాజాగా ఇప్పుడు మరో కేంద్ర మంత్రికి కరోనా నిర్థారణ అయింది.

ఆయుష్‌ శాఖ మంత్రి శ్రీపద్‌ నాయక్‌కు కరోనా సోకినట్టు తెలుస్తోంది. బుధవారం నిర్వహించిన కరోనా ... read more>>
Image
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రమాదకరమైన ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. శ్వాస సంబంధమైన సమస్యతో సంజయ్ ఆస్పత్రిలో చేరగా డాక్టర్ లు అన్ని రకాల టెస్టులను చేయగా కాన్సర్ విషయం బయటపడింది. క్యాన్సర్ చికిత్స కోసం ఆయన ఈ వారంలో అమెరికా వెళ్లనున్నట్టు కూడా సమాచారం. సంజయ్ ఆరోగ్యం పై ఆయన భార్య మాన్యత స్పందించారు. సంజయ్ దత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్న అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు సందేశంలో పేర్కొన్నారు.

"ఈ దశను అధిగమించడానికి మాకు మరింత బలం, ... read more>>
Image
బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ గా ఆమీర్ ఖాన్ తాజా చిత్రం లాల్ సింగ్ చద్దా సినిమా విడుదల కోసం ఆయన అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ చిత్రానికి ఇది అధికారిక రీమేక్. ఇండియన్ ఆడియెన్స్ కు తగ్గట్లుగా స్క్రిప్ట్ లో మార్పులు చేసారు. ఈ ఏడాది క్రిస్మస్ కు లాల్ సింగ్ చద్దా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఎప్పుడో ప్రకటించారు. 

తాజాగా ఈ సినిమాని  2021కు విడుదలను వాయిదా వేస్తున్నట్లు ఈ చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ ... read more>>
Image
బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్‌ గత వారం అస్వస్థతతో ముంబై లీలావతి హాస్పిటల్ లో చేరిన విషయం తెలిసిందే. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో సంజయ్ పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్ళాడు. అయితే ఊహించని విధంగా మంగళవారం వచ్చిన రిపోర్ట్స్ లలో ఆయనకు క్యాన్సర్ ఉన్నట్లు తెలింది. 

సంజయ్ కు ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకిందని  అది ప్రస్తుతం 3వ దశలో ఉందని మీడియాలో వార్తలొస్తున్నాయి. ఐతే దీనిపై సంజయ్ దత్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. వాస్తవానికి రెండు రోజుల చికిత్స ... read more>>
Image
దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 23మంది చనిపోగా, పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం రాత్రి 7.41 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 

వందే భారత్ మిషన్‌లో భాగంగా దుబాయ్ నుంచి 190 మంది ప్రయాణికులు, సిబ్బందితో దుబాయ్ నుంచి కోజికోడ్‌కు వచ్చిన ఎయిరిండియా విమానం భారీ వర్షం వల్ల ల్యాండింగ్ అవుతూ రన్‌వేను ఢీకొట్టి పక్క జారిపోయింది. 35 అడుగుఅల లోయలో పడి రెండు ముక్కలైంది. ఈ ... read more>>
Image
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్‌ అనుమానాస్పద మృతి సినీ వర్గాలతో పాటు, రాజకీయంగా కూడా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసును ముంబై పోలీసులు సరిగ్గా దర్యాప్తు చేయడంలేదని, సీబీఐ వారికి అప్పగించాలని కుటుంబ సభ్యులు, అభిమానులు, రాజకీయ నాయకుల ఒత్తిడితో ఈ కేసును విచారించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రంగంలోకి దిగింది. 

తాజాగా సుశాంత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకొంది. సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తి సహా ఆమె తల్లిదండ్రులు ఇంద్రజిత్‌ చక్రవర్తి, సంధ్యా చక్రవర్తి, సోదరుడు షోయిక్‌ చక్రవర్తితో ... read more>>
Image
కరోనా మహమ్మారి కల్లోలం దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఇప్పటికే సామాన్యులతో పాటు ఎందరో లోక్ సభ సభ్యులు, మంత్రులు కరోనా బారిన పడిన సంగతి తెల్సిందే. తాజాగా సినీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ కు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. కౌర్ తో పాటుగా ఆమె ఇంట్లో 11 మంది కరోనా బారిన పడ్డారు. 

మొదట ఆమె మామ గంగాధర్ రానాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆమె కుటుంబం మొత్తం హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ... read more>>
Image
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్న విషయం తెలిసిందే. రోజుకి పదివేలకు తక్కువ కాకుండా వ్యాధిబారిన పడుతున్నారు. సామాన్యులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు చాలా మంది వైరస్‌కు గురయ్యారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి కూడా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. 

స్వల్పంగా జ్వరంతో బాధపడుతున్న ఆయన కరోనా అనుమానంతో టెస్టులు చేయించుకున్నారు. దీంతో అతనికి పాజిటివ్ అని తేలింది. వెంటనే అతని భార్యకు చేయగా ... read more>>
Image
అధికార భారతీయ జనతా పార్టీ కీలక నేతలను కరోనా భయపెడుతోంది.  ఇప్పటికే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వైరస్ బారిన పడగా తాజాగా కర్నాటక సీఎం యడియూరప్పకు కూడా కరోనా సోకింది. ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో చికిత్స కోసం మణిపాల్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరూ అధైర్యపడవద్దని సూచించారు.

యడియూరప్పలో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించకున్నా ... read more>>
Image
దేశవ్యాప్తంగా క‌రోనా మహమ్మారి ఉధృతమవుతున్న నేప‌థ్యంలో ఇపుడు సామాన్య ప్ర‌జానీకంతోపాటు సెల‌బ్రిటీలు కూడా ఖ‌చ్చితంగా ఫేస్ మాస్క్ ధ‌రించాల్సిందే. దీంతో రకరకాల డిజైన్లలో మాస్కులు అందుబాటులోకి వచ్చాయి.  ఫేస్ మాస్కు అవ‌స‌రాన్ని, ప్రాముఖ్య‌త‌ను తెలియ‌జేస్తూ అందాల‌ భామ శృతిహాస‌న్ గోల్డ్ ఫేస్ మాస్క్ చేసిన  లేటెస్ట్ ఫోటోషూట్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.

ప్రఖ్యాత ఫిల్మ్ ఫేర్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై శృతిహాస‌న్ ఫొటో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. మెడ‌లో బంగారు చైన్లు, గోల్డ్ చైన్స్ అల్లిక‌తో త‌యారు చేసిన ... read more>>

   Politics

   Lifestyle