Image
చైనాతో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత దేశ ప్రధాని నరేంద్ర మోడి భారత - చైనా సరిహద్దు రేఖకు అతిసమీపంలో సముద్రమట్టానికి 11 వేల మీటర్ల ఎత్తులో ఉన్న " నిమూ " పోస్ట్ ను ఈ రోజు సందర్శించారు. ప్రధాని మోడీతో పాటు త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్.. ఆర్మీ చీఫ్ నరవణేతో కలిసి లద్దాఖ్ కు వెళ్లారు. నీములో ప్రధానికి లెఫ్టెనెంట్ జనరల్ హరీందర్ సింగ్ అక్కడి వివరాలు అందజేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడి 14 ఆర్మీ కాప్స్ హెడ్ ... read more>>
Image
ఎక్కడికి పోతావు చిన్నవాడా, ప్రేమ కథా చిత్రమ్ 2 సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన నందిత శ్వేతా ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఐపిసి 367. ఈ సినిమాలో నందిత పవర్ఫుల్  పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుంది. తాజాగా చిత్రానికి సంబందించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఒక బంగ్లాలో జరిగే అనూహ్య ఘటనలు పోలీసులకు సవాళ్లు గా మారిన వేళ ఆ సవాళ్ళను పోలీస్‌గా నందిత ఎలా పరిష్కరించిందనేది కథాంశం. ఒకవైపు సైన్స్‌ గొప్పతనాన్ని చెబుతూనే అతీంద్రీయ శక్తులను చూపించాడు దర్శకుడు. ... read more>>
Image
బిగ్‌బాస్ ఫేమ్, హీరోయిన్ తేజస్వి ఈ రోజు తన  పుట్టిన రోజును జరుపుకుంటోంది. తేజస్వి పుట్టినరోజు సందర్భంగా ల‌క్ష్మీకాంత్ చెన్నా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న వెబ్ అంథాల‌జీ సిరీస్ "క‌మిట్‌మెంట్‌" నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో బికినీలో అందాలు ఆరబోస్తూ చాలా హాట్‌గా క‌న‌ప‌డుతోంది తేజస్వి మదివాడ.

ఇండస్ట్రీ లోని కమిట్మెంట్స్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు ఉన్నారు. తేజస్వి మాదివాడ, రమ్య పసుపులేటి, సిమర్ సింగ్ ఇంకా అన్వేషి జైన్ ప్రధాన పాత్రలుగా రూపొందుతున్న ... read more>>
Image
ప్రముఖ ఫేస్ క్రీమ్ ఫెయిర్ అండ్ లవ్లీ తెలియని వారుండరు.  దశాబ్దాల నుండి వాడుకలో ఉన్న ఈ హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ ఉత్పాదన ఫెయిర్ అండ్ లవ్లీ క్రీముకి ఇప్పుడు కొత్త పేరు పెట్టేసారు. ఫెయిర్ అండ్ లవ్లీ స్థానంలో గ్లో అండ్ లవ్లీగా పేర్కొంటూ తన బ్రాండ్ కు కొత్త పేరును ఖరారు చేసారు.  ఇక నుంచి తమ ఉత్పత్తులను ‘గ్లో అండ్ లవ్లీ’,‘గ్లో అండ్ హ్యాండ్‌సమ్‌’ పేర్లతో మార్కెట్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. 

గత నెల అమెరికాలో నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ ... read more>>
Image
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత వారం రోజులుగా రోజుకు 20వేలకు దగ్గరగా కేసులు నమోదవుతుండడంతో ఇటు ప్రజలు అటు ప్రభుత్వాలు ఆందోళనలో ఉన్నాయి. తాజాగా లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 20903 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా బయటపడ్డాక ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. 

కొత్త పాజిటివ్‌ కేసులతో కలుపుకొని దేశంలో కరోనా బాధితుల సంఖ్య 6,25,439కు చేరింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఈ మహమ్మారి కారణంగా 379 మంది మృత్యువాత ... read more>>
Image
గతేడాది హృతిక్ రోషన్ టైగర్ ష్రాఫ్ హీరోలుగా రూపొందిన ‘వార్' సినిమాతో సూపర్ హిట్ అందుకొని ప్రస్తుతం జోరు మీద ఉన్న వాణీ కపూర్ బాలీవుడ్‌ కిలాడీ అక్షయ్‌ కుమార్ సరసన నాయికగా ఎంపికయ్యారు. రంజిత్‌ ఎం.తివారీ దర్శకత్వం వహిస్తున్న ‘బెల్‌ బాటమ్‌’ చిత్రంలో అక్షయ్‌ సరసన వాణీకపూర్‌ నటించనున్నారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు.

అక్షయ్‌కుమార్‌తో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసి ‘‘చాలా థ్రిల్లింగ్‌గా, ఎగ్జైటింగ్‌గా ఉంది. అక్షయ్‌ సర్‌తో కలిసి నటించడం కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నా’’ అని రాసుకొచ్చారు ... read more>>
Image
బాలీవుడ్ లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ (71) ఇక లేరు. గుండెపోటు కారణంగా శుక్రవారం ఉదయం ఆమె ముంబైలో తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా ఆనారోగ్యంతో ఉన్న ఆమె గత నెల 20న బాంద్రాలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటంతో కరోనా పరీక్షలు కూడా చేశారు. అయితే అందులో నెగిటివ్ అని వచ్చింది.  అయితే ఈ రోజు ఉదయం గుండెపోటుతో ఆవిడ కన్నుమూసారు. సరోజ్ ఖాన్ కూతురు ఆమె మరణాన్ని ధృవీకరించారు.

దాదాపు నాలుగు దశాబ్దాలుగా 2 వేలకు ... read more>>
Image
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దేశ ప్రజల శ్రేయస్సు కోసం ఓ కఠిన దీక్ష చేపట్టారు. కరోనాతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రజల కోసం పవన్ నాలుగు నెలల పాటు చాతుర్మాస్య దీక్ష చేయనున్నారు. ఆకాడ శుక్ల తొలి ఏకాదశి సందర్భంగా బుధవారం పవన్ తన దీక్షను ప్రారంభించారు. 

చాతుర్మాస్య దీక్ష ప్రకారం ఆయన నాలుగు నెలలు కఠిన నియమాలు పాటించనున్నాడు. ముఖ్యంగా బ్రహ్మచర్యం, నదీస్నానం, ఒంటి పూట భోజనం, నేలపై పడుకోవడం, కోపం ద్వేషం వంటి ఎమోషన్స్ వదిలేసి శాంతికా ముఖుడు కానున్నాడు. ... read more>>
Image
నాగ‌చైత‌న్య‌, సమంత జోడీ వెండితెరపైన ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  వీరిద్ద‌రూ జతగా ఏమాయ చేసావె, ఆటోన‌గ‌ర్ సూర్య‌, మ‌నం, మ‌జిలీ చిత్రాల్లో న‌టించారు. ఆటోన‌గ‌ర్ సూర్య మిన‌హా మిగిలిన చిత్రాల‌న్నీ మంచి విజ‌యాల‌ను అందుకున్న‌వే. తాజాగా ఈ జంట మరోసారి వెండితెరపై సందడి చేయనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

బ్లాక్ బస్టర్ “మనం ” మూవీ ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “థ్యాంక్ యూ “మూవీ తెరకెక్కనుంది. రైట‌ర్, డైరెక్ట‌ర్ ... read more>>
Image
తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఈ కంటికి కనిపించని మహమ్మారి సామన్యులనే కాకుండా ప్రముఖులను కూడా వదలడం లేదు. ఇప్పటికే బండ్ల గణేష్, టీవీ నటులు ప్రభాకర్,  నవ్య స్వామి సహా మరో సీరియల్ నటుడికి కరోనా సోకింది. గత కొన్ని రోజులుగా సినీ దర్శకుడు, నటుడు, విమర్శకుడు కత్తి మహేష్ కు కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్దారణ అయిందని సోషల్ మీడియాలో వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

అయితే తనకు కరోనా సోకిందన్న ప్రచారంపై మహేష్ తీవ్రంగా స్పందించారు.  తనకు కరోనా ... read more>>

   Politics

   Lifestyle