Image
భారత్ లో రోజు రోజుకు కోరోమా మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రిలయెన్స్ జనరల్ ఇన్స్యూరెన్స్ కోవిడ్ 19 ప్రొటెక్షన్ ఇన్స్యూరెన్స్ స్కీమ్‌ను ప్రకటించింది. మూడు నెలల నుంచి 60 ఏళ్ల వయస్సు లోపు ఉన్న వారెవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు.  కరోనా వైరస్ పాజిటీవ్ వచ్చిన వారికి బీమా 100 శాతం ఇవ్వడం ఈ ప్లాన్ ప్రత్యేకత. బీమా ఆప్షన్ రూ.25,000 నుంచి రూ.2,00,000 వరకు ఉంటుంది. 

ఒకవేళ పాలసీహోల్డర్ క్వారెంటైన్‌లోకి వెళ్తే బీమా మొత్తంలో 50 శాతం పొందొచ్చు. ఈ పాలసీ ... read more>>
Image
విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో కరోనా భాదితులకు వైద్యం అందించే డాక్టర్లకు కనీస సౌకర్యాలు లేవని, ఒక మాస్క్ ఇచ్చి పదిహేను రోజులు వాడమంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన వైద్యుడు సుధాకర్ రావుపై ను రాష్ట్ర వైద్య విధాన పరిషత్ సస్పెండ్ చేయడం తెలిసిందే. సుధాకర్ రావు పై  ‘కరోనా’ సంక్షోభ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం, 144 సెక్షన్ ఉల్లంఘన, ఉన్నతాధికారులను వ్యక్తిగతంగా దూషించడం వంటి నేరాల కింద కేసులు కూడా నమోదు చేసినట్టు తెలుస్తోంది.

సుధాకర్ రావు సస్పెన్షన్ పై ... read more>>
Image
కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న కారణంగా దేశావ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ వలన సినిమా షూటింగ్స్ నిలిచిపోవడంతో రోజువారీ సినీ కార్మికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. టాలీవుడ్ సినీ కార్మికులను ఆదుకోవ‌డానికి మెగాస్టార్ చిరంజీవి చైర్మ‌న్‌గా క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ఏర్పాటైంది. ఇప్పటికే పలువురు సీసీసీకి త‌న వంతుగా విరాళాలు అందించారు. 

తాజాగా సాయి కుమార్ తనవంతు సాయాన్ని అందజేశారు. “సి సి సి కి 500004 రూపాయలు విరాళం, అలాగే డబ్బింగ్ ... read more>>
Image
కరోనా వైరస్ మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు దేశావ్యాప్తంగా లాక్‌డౌన్ పాటిస్తున్న సంగతి తెలిసిందే . లాక్ డౌన్ కారణంగా సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకూ కరోనా షాక్ తగిలింది. ఈ వైరస్ పుణ్యమా అని పంచంలోనే టాప్ టెన్ కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ అధినేత అంబానీ తన సంపదలో 28 శాతం కోల్పోయినట్లుగా హురూన్ నివేదిక వెల్లడించింది.

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపధ్యంలో స్టాక్‌ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా తన సంపదలో 28 శాతం కోల్పోవడంతో ఆయన నికర ఆస్తుల విలువ 48 ... read more>>
Image
మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు గడిచిపోయాయి. అటు పెద్ద హీరోల సరసన నటిస్తూ కుర్రహీరోల పక్కన కూడా నటిస్తున్న తమన్నా అందం మరియు అభినయంతో ఎందరో అభిమానులను సంపాదించుకుంది. అయితే కొత్త కథానాయికలు ఎంట్రీ ఇవ్వడంతో  తమన్నాకు ఇటీవల కాలంలో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. తమన్నా పారితోషికం కూడా దీనికి మరో కారణమని అనేవారు లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే తమన్నా పనైపోయిందనీ, ఎటు వైపు నుంచి చూసినా ఆమెకు పెద్దగా అవకాశాలు లేవనే వార్తలు షికారు చేస్తున్నాయి.

ఇటీవల ... read more>>
Image
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి హడలెత్తిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈ మహమ్మారి కారణంగా రోజుకి వేలసంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. మన దేశంలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. తాజా లెక్కల ప్రకారం మంగళవారం నాటికి మన భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,351కు చేరింది. మృతుల సంఖ్య 149కు పెరిగింది. 4,723 మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగా ఇప్పటివరకు 468 మంది రికవర్ అయ్యారు. 

మహారాష్ట్రలో ఎక్కువగా 1,018 కేసులు నమోదవగా 64 మంది ... read more>>
Image
ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మూడవ సినిమా 'పుష్ప'. అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా ఈ రోజు పుష్ప సినిమా నుండి కొద్దిసేపటి క్రితం ఫస్ట్‌లుక్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. బన్నీ ఊర మాస్ అవతారంలో ఉన్న ఆ పోస్టర్ విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. 

అయితే పుష్ప సినిమాలో బన్నీకి సంబంధించి మరో లుక్‌ విడుదల అయింది.  ఈ లుక్‌ను అల్లు అర్జున్‌ తన ... read more>>
Image
మెగాస్టార్ చిరంజీవి  మరోసారి తన గొప్పమనసు చాటుకున్నాడు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సినీ కార్మికులు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్తితి రావడంతో కరోనా క్రైసిస్ ఛారిటీ పెట్టీ, సినీ ప్రముఖుల సైతం విరాళాలు అందించేలా చర్యలు తీసుకున్న చిరంజీవి తాజాగా ఓ లేడి ఫ్యాన్ కు ఆరోగ్యం బాగాలేదని తెలిసి ఆమెకు ఆర్ధిక సాయం చేసాడు.

గుంటూరు జిల్లా చిరంజీవి అంజనా మహిళా సేవా సంస్థ అధ్యక్షురాలుగా సేవలందిస్తోన్న కుమారి రాజనాల వెంకట నాగలక్ష్మి గత కొంతకాలంగా గుండె జబ్బుతో ... read more>>
Image
యువ నటి కీర్తి సురేష్ త్వరలో ఒక బడా వ్యాపారవేత్తతో పెళ్లి పీటలెక్కబోతోందని సోషల్ మీడియాలో, ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్లలో ఒక వార్త రెండు రోజుల క్రితం వచ్చి తీవ్ర చర్చనీయంసం అయింది. కీర్తి మనువాదబోయే వాడు ఒక బీజీపీ నేత కొడుకని కూడా ప్రచారం జరిగింది. వీరి వివాహం ఈ యేడు డిసెంబర్ నెలలో జరగనుందని కూడా రాసేసారు. 

అయితే కీర్తి ఈ వార్తల పై స్పందిస్తూ ఇంకో రెండేళ్ళ వరకు తనకు పెళ్లి చేసుకునే టైం లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను పూర్తిగా ... read more>>
Image
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా ఇంట్లో ఉన్నాడు. హీరోలందరూ ఈ ఆపత్కర సమయంలో ప్రభుత్వాలకు తమ వంతు సాయం ప్రకటిస్తుంటే విజయ్ మాత్రం ఎటువంటి సాయం ప్రకటించలేదు. కేర‌ళ‌లో ఏర్ప‌డిన ప్ర‌కృతి విప‌త్తుకి స్పందించి త‌న వంతు స‌హాయంగా ముందుకొచ్చిన దేవరకొండ కరోనా సమయంలో సోష‌ల్‌మీడియా వేదిక‌గా ఎలాంటి ట్వీట్‌లుచేయ‌డం లేద‌ని ఇటీవ‌ల చ‌ర్చ‌జ‌రుగుతోంది. 

ఈ క్రమంలో విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా మాస్కులు డాక్టర్లకి వదిలేసి కర్చీఫ్‌లు వాడండని కొత్త స్లోగ‌న్ వినిపిస్తున్నాడు. నా ... read more>>

   Politics

   Lifestyle