in

నిర్మాతలకు పరిష్కారం చూపిన విశాల్

hero vishal

తమిళనాట  ప్రతి సినిమా టిక్కెట్‌‌పై ఒక రూపాయి రైతులకు కేటాయించాలని తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ తీసుకున్న నిర్ణయం  తెలిసిందే. అయితే నిర్మాతలు ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేసారు. దీంతో విశాల్ వారికి ఒక చక్కటి పరిష్కారం చూపారు. టీవీ చానళ్లకు తమ సినిమాల పాటలు, ట్రైలర్లు, క్లిప్పింగ్‌లను ఉచితంగా ఇవ్వొద్దని నిర్మాతల సంఘం సభ్యులందరికీ విశాల్‌ సూచించారు. నిర్మాతలకు ఆదాయం సమకూర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, కంటెంట్‌కు డబ్బులు చెల్లించాలని టీవీ చానళ్లను కోరామని నిర్మాతల సంఘం కార్యవర్గ సభ్యులు తెలిపారు. సినిమాలకు సంబంధించిన పాటలు,ట్రైలర్లు,క్లిప్పింగ్‌లతో టీవీ చానళ్లకు భారీ ఆదాయం వస్తున్నప్పుడు దానిలో కొంత నిర్మాతలకు ఇవ్వడంలో తప్పు లేదని విశాల్ తెలిపారు.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

sunrisers hyderabad

ఐపీఎల్ 2017: ఢిల్లీపై సన్‌రైజర్స్ విజయం

sleeping benefits

మధ్యాహ్నం నిద్రిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?